జియోఫోన్ నెక్స్ట్ ధరను రూ.6499గా నిర్ణయించినట్లు జియో, గూగుల్ ప్రకటించాయి. దీపావళి నుంచి ఈ చౌక ధర 4జీ స్మార్ట్ఫోన్ వినియోగదారులకు అందుబా టులోకి రానుంది. రూ. 1999 ముందుగా చెల్లించి, మిగతా మొత్తాన్ని నెలవారీ కిస్తీలతో 18-24 నెలల్లో చెల్లించవచ్చని జియో వెల్లడిం చింది. రూ.300 - 600 వరకు ఈఎంఐ చెల్లిం పులతో డేటా, టాక్లైమ్ ఆఫర్లను కంపెనీ ఇవ్వనుంది. ఇందుకు ప్రాసెసింగ్ రుసుముగా రూ.501 వసూలు చేయనుంది. క్వాల్కమ్ చిప్సెట్తో రూపొం దించిన ఈ స్మార్ట్ఫోన్ దేశవ్యాప్తంగా ఉన్న జియోమార్ట్ డిజిటల్ రిటైల్ స్టోర్లలో లభించనుంది. పండగల సీజన్లో చౌకధర స్మార్ట్ఫోన్ను భారత విని యోగదారులకు గూగుల్, జియో అందించడం సంతోషకరమని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ పేర్కొన్నారు. ఇంటర్నెట్ ప్రయోజనాలను ప్రతి ఒక్కరూ పొందేలా, అందుబాటు ధరలో ఈ స్మార్ట్ఫోన్ను భారత్ కోసమే రూపొందించినట్లు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ వెల్లడించారు.
No comments:
Post a Comment