ఉన్నత పాఠశాల ఆవరణలో / ప్రక్కనే / 250 మీటర్ల దూరం లోపు గల ప్రాధమిక పాఠశాలల్లోని 3,4,5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేస్తారు.
ప్రాధమిక పాఠశాలల్లోని SGT లను 1:30 / 1:20 ప్రాతిపదికన 1,2 తరగతుల బోధనకు కేటాయిస్తారు.
ప్రాధమిక పాఠశాలల్లోని జూనియర్ టీచర్ల ను 1,2 తరగతులు బోధించేందుకు వినియోగిస్తారు.
ఎవరైనా సీనియర్ టీచర్ కు 3 నుండి 10 తరగతులు బోధించేందుకు తగిన అర్హత లేని యెడల...అట్టి అర్హత కలిగిన జూనియర్ టీచర్ ని ఉన్నత పాఠశాలకు పంపుతారు.
తాను ప్రాధమిక పాఠశాలలో ఉండాలా లేక ఉన్నత పాఠశాలకు వెళ్లాలా... అనే ఐచ్చికం LFL HM కి ఇస్తారు. (ఏది ఏమైనప్పటికీ ఉన్నత పాఠశాలల్లో అవసరమగు విద్యార్హత కల్గిన ఉపాధ్యాయులు ఉండాలి)
ఉన్నత పాఠశాలల్లో సరిపడా స్థలం / గదులు లేనట్లయితే...3 నుండి 5 తరగతులు ప్రాధమిక పాఠశాలల్లోనే నడుపుతారు.
దీని కొరకు ప్రాధమిక పాఠశాలల నుండి ఉన్నత పాఠశాలలకు వెళ్లిన ఉపాధ్యాయులే కాక ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు కూడా పాఠ్య బోధన చేస్తారు.
ఒకవేళ 3 నుండి 10 తరగతులు బోధించేందుకు టీచర్ల లభ్యత కొరవడినట్లయితే ... జిల్లా లోని సర్ ప్లస్ ఉపాధ్యాయుల్ని పని సర్దుబాటు క్రింద నియమిస్తారు.
3 నుండి 10 తరగతులు బోధించు ఉపాధ్యాయులకు.. వారానికి 32 బోధనా పీరియడ్ల కంటే మించరాదు
సదరు విలీన ప్రక్రియ ది.31.10.2021 నాటికి పూర్తి కావలెను
ది.01.11.2021 నుండి నూతన విద్యా విధానం (5+3+3+4) అమలు కావలసి ఉంటుంది
ఇది ముసాయిదా మాత్రమే. దీనిపై అధికార ప్రకటన వెలువడాల్సి ఉంది.
No comments:
Post a Comment