APTF VIZAG: ఏకోపాధ్యాయ బడుల్లో 89 శాతం గ్రామాల్లోనే!: యునెస్కో

ఏకోపాధ్యాయ బడుల్లో 89 శాతం గ్రామాల్లోనే!: యునెస్కో

దేశంలో ఏకోపాధ్యాయ పాఠశాల్లో 89 శాతం గ్రామీణ భారత్లోనే ఉన్నాయని యునెస్కో నివేదించింది. దాదాపు 1.2 లక్షల పాఠశాలల్లో ఒకే టీచర్ ఉన్నట్లు పేర్కొంది. దేశంలో ఉపాధ్యాయుల కొరతను అధిగమించడానికి కనీసం లక్షల టీచర్లు అదనంగా అవసరమని నివేదించింది. 'స్టేట్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ రిపోర్ట్ ఫర్ ఇండియా - 2021' రిపోర్టును యునెస్కో విడుదల చేసింది. ప్రొఫెసర్ పద్మ ఎం సారంగపాణి నేతత్వంలోని టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (ముంబాయి) నుండి నిపుణుల బందంతో కలిసి యునెస్కో ఈ నివేదిక రూపొందించింది. దేశంలో ఒకే టీచర్ ఉన్న పాఠశాలలు 89 శాతం గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయి. దేశంలో ప్రస్తుత ఉపాధ్యాయ కొరతను తీర్చడానికి ఇంకా 11.16 లక్షల మంది అదనపు ఉపాధ్యాయులు అవసరమని నివేదిక పేర్కొంది. ఈ నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో 1,10,971 (7.15 శాతం) ఏకోపాధ్యాయ పాఠశాలలే. ఏపిలో మొత్తం పాఠశాలలు 63,621 ఉన్నాయని, అందులో 80 శాతం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయని తెలిపింది. మొత్తం 3,770 మంది టీచర్లు ఉన్నారని, అందులో 72 శాతం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారని తెలిపింది. ఏపిలో 49 శాతం మహిళ ఉపాధ్యాయులు ఉన్నారని, 9,160 (14 శాతం) ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయని నివేదిక తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో 91 శాతం ఖాళీలు ఉన్నాయని, 11 శాతం స్కూల్లో ఖాళీలు ఉన్నాయని పేర్కొంది. ఏపీలో ఇంకా 27,398 ఉపాధ్యాయులు అవసరం ఉంది.

No comments:

Post a Comment

Featured post

AP 10th class public exams result released today