APTF VIZAG: ఇక నుంచి ప్రభుత్వ GO లు ఆఫ్ లైన్ లొనే ఆన్లైన్ లో పెట్టకూడదు అని ప్రభుత్వం నిర్ణయం.

ఇక నుంచి ప్రభుత్వ GO లు ఆఫ్ లైన్ లొనే ఆన్లైన్ లో పెట్టకూడదు అని ప్రభుత్వం నిర్ణయం.

ప్రభుత్వ ఉత్తర్వులను ఇక నుంచి ఆన్‌లైన్‌లో ఉంచకూడదని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులకు సమాచారం ఇస్తూ మెమో జారీ చేసింది. ఇకపై ఆఫ్‌లైన్‌లో మాత్రమే ప్రభుత్వ ఉత్తర్వులు ఉంటాయని సాధారణ పరిపాలన శాఖ  స్పష్టం చేసింది. ఇటీవల బ్లాంక్‌ జీవోల జారీ వివాదాస్పదం కావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.  కాగా, 2002 నుంచి జీవోలను ఆన్‌లైన్‌ ప్రజలకు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం ఉంచుతోంది.

No comments:

Post a Comment