సీబీఎస్‌ఈ పదో తరగతి ఫలితాలు మంగళవారం వెల్లడయ్యాయి. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు సీబీఎస్‌ఈ బోర్డు ఈ ఫలితాలను విడుదల చేసింది. ఈ ఫలితాలను బోర్డు అధికారిక వెబ్‌సైట్లు cbseresults.nic.in,
లతో పాటు డిజిలాకర్ యాప్‌లోనూ తెలుసుకోవచ్చు. ఫలితాలు పొందేందుకు విద్యార్థులు తమ రోల్ నంబర్‌తో పాటు స్కూల్ నంబర్‌ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కరోనా ఉద్ధృతి దృష్ట్యా ఈ ఏడాది కూడా సీబీఎస్‌ఈ 10, 12 తరగతి పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే. గతవారం 12వ తరగతి ఫలితాలను విడుదల చేయగా.. రికార్డు స్థాయిలో 99.37శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.
No comments:
Post a Comment