APTF VIZAG: పాఠశాలల్లోనే టెస్టింగ్ కేంద్రాలు.కర్ఫ్యూ గంట కుదింపు.కోవిడ్ సమీక్షలో సిఎం

పాఠశాలల్లోనే టెస్టింగ్ కేంద్రాలు.కర్ఫ్యూ గంట కుదింపు.కోవిడ్ సమీక్షలో సిఎం

పాఠశాలల్లోనే కరోనా టెస్టింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి, అవసరమైన విద్యార్థులకు అక్కడే పరీక్ష నిర్వహించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాఠశాలలు వైద్యారోగ్యశాఖ మార్గదర్శకాలు పాటించేలా అధికారులు దృష్టి పెట్టాలన్నారు. ప్రతిఒక్కరూ మాస్క్ ధరించడంతోపాటు భౌతిక దూర౦ పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎవరికైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు నిర్వహించాలన్నారు. కర్ఫ్యూ సమయాన్ని గంట కుదిస్తున్నట్లు చెప్పారు. ఇక నుండి రాత్రి 11 గంటల నుండి ఉదయం ఆరు గంటల వరకు కర్ఫ్యూ ఉంటుందన్నారు. తెల్లవారుజామున పెళ్లిళు అంటే ముందస్తుగా అనుమతి తీసుకోవాలని, 150 మందికే అవకాశ ఇవ్వాలని సూచించారు. ప్రభుత్వం వద్ద ఔషధ కంపెనీల రిజిస్ట్రేషన్ అంశాన్ని కూడా పరిశీలించాలని ఆదేశించారు. నిర్దేశించిన 90 రోజుల్లో ప్రభుత్వాస్పత్రులు, బోధానాస్పత్రుల్లో రిక్రూట్మెంట్పూ ర్తిచేయాలన్నారు.

No comments:

Post a Comment