APTF VIZAG: స్కూళ్ల మూసివేతతో విపరిణామాలు.అవి విస్మరించలేనంత తీవ్రమైనవి.పిల్లల మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం.సాధ్యమైనంత త్వరగా పాఠశాలలు పునఃప్రారంభించాలి. పార్లమెంటరీ స్థాయీ సంఘం నివేదిక.రెండు షిఫ్టుల్లో క్లాసులు

స్కూళ్ల మూసివేతతో విపరిణామాలు.అవి విస్మరించలేనంత తీవ్రమైనవి.పిల్లల మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం.సాధ్యమైనంత త్వరగా పాఠశాలలు పునఃప్రారంభించాలి. పార్లమెంటరీ స్థాయీ సంఘం నివేదిక.రెండు షిఫ్టుల్లో క్లాసులు

పాఠశాలలు ఏడాదికిపైగా మూతపడడం వల్ల చదువులు ఆగిపోవడమే కాదు, దేశంలో బాల్య వివాహాల సంఖ్య కూడా పెరిగినట్లు పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ గుర్తించింది. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని సాధ్యమైనంత త్వరగా స్కూళ్లను తెరిచే ఆలోచన చేయాలని ఉద్ఘాటించింది. విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, పాఠశాలల సిబ్బందికి కరోనా వ్యాక్సినేషన్‌ వేగంగా పూర్తిచేసి, పాఠశాలలు తెరవొచ్చని సూచించింది. స్కూళ్లలో భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం, శుభ్రత పాటించడం వంటి నిబంధనలు కఠినంగా అమలు చేయాలని వెల్లడించింది. తరగతి గదుల్లో విద్యార్థుల సంఖ్యను తగ్గించడానికి రెండు షిఫ్టుల్లో క్లాసులు నిర్వహించాలని తెలిపింది. పిల్లలను సెక్షన్లుగా విభజించి, రోజు విడిచి రోజు క్లాసులు నిర్వహించవచ్చని సూచించింది.

స్కూళ్లలో తరచుగా తనిఖీలు

విద్యార్థుల నుంచి హాజరు తీసుకొనేటప్పుడు థర్మల్‌ స్క్రీనింగ్‌తోపాటు తరచుగా ఆర్‌టీ–పీసీఆర్‌ టెస్టులు నిర్వహించాలని స్థాయీ సంఘం కోరింది. ప్రతి పాఠశాలలో కనీసం రెండు ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు ఏర్పాటు చేయాలని, పిల్లలకు ఏదైనా అనారోగ్యం సంభవిస్తే వైద్య సాయం అందించడానికి శిక్షణ పొందిన సిబ్బందిని నియమించాలని ప్రభుత్వానికి ప్రతిపాదించింది. స్కూళ్లలో కోవిడ్‌–19 ప్రోటోకాల్స్‌ కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని, ఇందుకోసం హెల్త్‌ ఇన్‌స్పెక్టర్లు, ఆరోగ్య కార్యకర్తలు తరచుగా తనిఖీలు చేయాలని తెలిపింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో పాఠశాలలను పునఃప్రారంభించారని, అక్కడ పాటిస్తున్న ఉత్తమమైన విధానాలను మన దేశంలోనూ అమలు చేయవచ్చని తెలియజేసింది.

No comments:

Post a Comment

Featured post

AP 10th class public exams result released today