APTF VIZAG: NEET Exam date announced, exam held on September 12th

NEET Exam date announced, exam held on September 12th

 నీట్-2021 పరీక్ష తేదీ ఖరారు.. ఎగ్జామ్ సెంటర్లు పెంపు.

కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడిన నీట్(యూజీ) పరీక్షా తేదీని కేంద్రం విడుదల చేసింది. సెప్టెంబర్ 12న కరోనా నిబంధనలకు అనుగుణంగా దేశవ్యాప్తంగా నీట్ పరీక్షను నిర్వహిస్తామని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.

రేపు(జూలై 13) సాయంత్రం 5 గంటల నుంచి NTA వెబ్‌సైట్ల ద్వారా అప్లికేషన్ ప్రాసెస్ ప్రారంభమవుతుందని ఆయన అన్నారు. సామాజిక దూరం పాటించే విధంగా ఎగ్జామ్ నిర్వహించే నగరాలను 155 నుంచి 198కి పెంచుతున్నామని.. అలాగే గత సంవత్సరం(3862) కంటే ఈ ఏడాది పరీక్షా కేంద్రాలను సైతం పెంచనున్నట్లు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు.

కాగా, ప్రతీ సెంటర్ వద్ద విద్యార్ధులకు మాస్కులు అందుబాటులో ఉంటాయని.. ఎంట్రీ, ఎగ్జిట్‌కు నిర్దేశిత టైంస్లాట్స్‌తో పాటు కాంటాక్ట్‌లెస్ రిజిస్ట్రేషన్, శానిటైజేషన్, విద్యార్ధికి విద్యార్ధి మధ్య సామాజిక దూరం ఉండేలా సీటింగ్ విధానాన్ని ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. కాగా, మెడికల్ కాలేజీల్లో ఆడ్మిషన్ల కోసం నీట్ పరీక్షలను నిర్వహిస్తారు. ఈ పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా ఆయా కాలేజీల్లో అభ్యర్థులకు సీట్లను కేటాయిస్తారు.

No comments:

Post a Comment