APTF VIZAG: ఆంధ్రప్రదేశ్‌లో కర్ఫ్యూ సడలింపు సమయాల్లో మార్పులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఆంధ్రప్రదేశ్‌లో కర్ఫ్యూ సడలింపు సమయాల్లో మార్పులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

◆గోదావరి జిల్లాల్లో ఉదయం 6 నుంచి రాత్రి 7 వరకు సడలింపులు ఉంటాయని తెలిపింది.సాయంత్రం ఆరు గంటలకే దుకాణాలు మూసేయాలని ఆదేశించింది.

వైద్యారోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

◆మిగతా జిల్లాల్లో ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు సడలింపులు ఉండనున్నాయి. 

◆గోదావరి జిల్లాలు మినహా మిగతా చోట్ల రాత్రి 9 గంటలకే దుకాణాలు మూసేయనున్నారు.

ఉభయ గోదావరిలో పాజిటివిటీ రేటు 5 శాతం లోపు వచ్చే వరకు అక్కడ ఈ ఆంక్షలు కొనసాగనున్నాయి.

◆ఈ సడలింపులు ఈ నెల 8 నుంచి అమల్లోకి రానున్నాయి.అదే విధంగా.. రాష్ట్రంలో సినిమా థియేటర్లు తెరిచేందుకు అనుమతినిచ్చింది.

◆అయితే, సీటుకు సీటుకు మధ్య గ్యాప్‌ ఉండాలని ఆంక్షలు విధించింది. 

ఇక కోవిడ్‌ ప్రొటోకాల్స్‌తో రెస్టారెంట్లు, జిమ్స్‌, కల్యాణ మండపాలకు అనుమతినిచ్చిన ప్రభుత్వం...శానిటైజర్‌, మాస్క్‌ ధరించడం, భౌతికదూరం పాటించడం తప్పని సరి అని పునరుద్ఘాటించింది.

No comments:

Post a Comment

Featured post

AP 10th class public exams result released today