పాఠశాలలను ఆగస్టు నుంచి ప్రారంభించేలా ప్రణాళిక రూపొందిస్తున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ చెప్పారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కొవిడ్ దృష్ట్యా విద్యార్థులందరూ రోజూ రావాల్సిన అవసరం లేకుండా..ఒకరోజు 50శాతం మంది, తర్వాతి రోజు మిగిలిన 50శాతం మంది తరగతులకు వచ్చేలా ఆలోచిస్తున్నామని తెలిపారు. కరోనా తొలి దశ అనంతరం కూడా ఇలాగే తరగతులు నడిచాయి. ఒకరోజు కొన్ని తరగతులకు, మరో రోజు మరికొన్ని తరగతులకు క్లాసులు నిర్వహించారు. ఇప్పుడు కూడా అదే పద్ధతిని అమలుచేస్తామని మంత్రి సురేశ్ చెప్పారు. అయితే, కరోనా మూడో వేవ్ ఎలా ఉంటుందన్నదానిపైనా ఈ ప్రణాళిక, తరగతుల నిర్వహణ ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు.
No comments:
Post a Comment