APTF VIZAG: Baseline test and Marks upload process

Baseline test and Marks upload process

రాష్ట్ర విద్యా శాఖ ఆదేశాల మేరకు జూలై 27 నుండి 31 వరకు మన పాఠశాలలో  బేస్ లైన్ పరీక్ష నిర్వహణకు, ఆగస్టు 4 వతేది నుండి10 వ తేది వరకు మార్కుల నమోదు కు సూచనలు

సబ్జెక్ట్ ఉపాధ్యాయులకు సూచనలు:

 ఉపాధ్యాయులు వారు గత సంవత్సరం బోధించిన సబ్జెక్టుకు సంబంధించి ప్రతి తరగతికి  విద్యార్థుల పూర్వజ్ఞానాన్ని పరిశీలించే విధంగా మోడల్ పేపర్లో సూచించిన విధంగా 10 బిట్లు తయారుచేసి తరగతి ఉపాధ్యాయునికి ఆదివారం సాయంత్రం లోపు పంపాలి.

తరగతి ఉపాధ్యాయులకు సూచనలు:

తరగతి సంబంధించి సబ్జెక్టు ఉపాధ్యాయులు ఇచ్చినటువంటి బిట్స్ అన్నింటినీ కలిపి కన్సాలిడేటెడ్ ప్రశ్నపత్రాన్ని 60 ప్రశ్నలతో తయారుచేసి అవసరమైనన్ని కాపీలు పాఠశాల ఖర్చుతో జిరాక్స్ తీయించవలెను. వాటిని  విద్యార్థులను దత్తత ఇచ్చిన ఉపాధ్యాయులకు అందజేయవలెను. ఈ పనులను సోమవారం లోపు పూర్తిచేయాలి.

విద్యార్థులను దత్తత తీసుకున్న ఉపాధ్యాయులకు సూచనలు:

 ఉపాధ్యాయులు వారికి దత్తత ఇచ్చిన విద్యార్థులకు సంబంధిత ప్రశ్నాపత్రాలను వారి తల్లిదండ్రుల ద్వారా ఫోన్ చేసి జూలై27 నుండి పిలిపించి అందజేసి విద్యార్థులతో పరీక్ష వ్రాయించి తిరిగి తల్లిదండ్రుల ద్వారా జూలై 31 లోపు తెప్పించుకొనవలెను. 

ఆ విద్యార్థులకు సంబంధించి ప్రశ్నాపత్రాలను "కీ" ద్వారా మూల్యాంకనం చేసి, నిర్దేశిత తేదీలలో కేటాయించిన విద్యార్థుల మార్కులను అప్లోడ్ చేయించవలెను.

No comments:

Post a Comment