APTF VIZAG: ప్రారంభ పరీక్ష (BASE LINE TEST) నిర్వహణకు సూచనలు..

ప్రారంభ పరీక్ష (BASE LINE TEST) నిర్వహణకు సూచనలు..

1) అన్ని పాఠశాలల్లో 1 వ.తరగతి నుండి 10 తరగతులకు అందరు విద్యార్థులకు ప్రారంభ పరీక్ష నిర్వహించాలి.

2) కింది తరగతి పాఠ్యాంశ విషయాలు మరియు సామర్థ్యాలకు అనుగుణంగా మాదిరి పరీక్ష పత్రాలు ఇవ్వడం జరిగింది. వీటి ఆధారంగా ఉపాధ్యాయులు స్వయంగా ప్రారంభ పరీక్ష ప్రశ్న పత్రాలు తయారు చేసి నిర్వహించాలి.

3) ఎట్టి పరిస్థితుల్లో విద్యార్థులను పాఠశాలకు పిలవరాదు. 

4) తల్లి తండ్రులు ద్వారా పరీక్ష పత్రాలు పంపిణీ మరియు పరీక్ష రాసిన అనంతరం తిరిగి పొందడం చేయాలి. 

5) పరీక్ష నిర్వహణ జూలై 27 నుండి 31 వరకు జరపాలి.

6) మూల్యాంకనం జూలై 28 నుండి 3 ఆగష్టు వరకు చేయాలి.

7) మార్కుల నమోదు ఆగష్టు 4 నుండి 10 వరకు. 

level 1.. 1&2 తరగతులకు. 

level 2.. 3,4&5 తరగతులకు.

6 నుండి 10 వరకు తెలుగు,ఇంగ్లీష్ మాధ్యమం మరియు మైనర్ మీడియం.

8) తెలుగు మరియు ఆంగ్ల మాధ్యమంలో విడివిడిగా ప్రశ్న పత్రాలను తయారు చేసుకోవాలి.

పై ప్రణాళిక సమర్థవంతంగా నిర్వహణ చేయడానికి ఉపాధ్యాయులు మరియు ప్రధానోపాధ్యాయులు భాధ్యత వహించాల్సి ఉంటుంది.

No comments:

Post a Comment

Featured post

FLN G 20 janbagidaari YouTube live program in diksha