APTF VIZAG: ఈరోజు ఉపాధ్యాయ సంఘాలతో SCERT డైరెక్టర్ జెడి B.ప్రతాపరెడ్డి గారు సమావేశం లో చర్చించిన ప్రధాన అంశాలు

ఈరోజు ఉపాధ్యాయ సంఘాలతో SCERT డైరెక్టర్ జెడి B.ప్రతాపరెడ్డి గారు సమావేశం లో చర్చించిన ప్రధాన అంశాలు

జూలై నెలలో పాఠశాలల పునః ప్రారంభం ఉండదని కానీ విద్యార్థులకు ఆన్లైన్ ద్వారా మరియు దూరదర్శన్ ద్వారా విద్యాబోధన చేయాలని, దానికి కార్యాచరణ చేపట్టాలని తెలిపారు. నిర్వహణ, మూల్యాంకనం గురించి సూచనలను అడిగారు.

ఒకటవ తరగతి నుండి 8వ తరగతి వరకు ఆన్లైన్ నందు విద్యాబోధన అవసరం లేదని, 9 మరియు పదవ తరగతి లకు ఆన్లైన్ ద్వారా విద్యాబోధన చేపడుతూ, ఆ అంశాలపై గల అసైన్మెంట్ ల పర్యవేక్షణ కొరకు వారానికి ఒకరోజు 10 am - 1pm వరకు నిర్వహించేలా, విద్యార్థులను పాఠశాలకు వచ్చే అవసరం లేకుండా ఈ కార్యక్రమం మొత్తం వాలంటీర్ల ద్వారా జరిపే విధంగా చేయాలని తెలియజేయడమైనది.

అడ్మిషన్ల గురించి వివరణ అడగగా పాఠశాలలు ప్రారంభించిన తర్వాతే అడ్మిషన్ల అంశం వచ్చునని తెలియజేశారు.

సర్వీస్ రూల్స్ విషయం గత రెండు దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్నందున ప్రభుత్వం వైపు నుండి కొన్ని ప్రతిపాదనలు తెలియజేయడం జరిగినది ఏ మేనేజ్మెంట్ వారికి ఆ మేనేజ్మెంట్ ల వారీగా,  వీటిలో ప్రత్యేకించి 13 డీఈఓ పోస్టులు, 49 డిప్యూటీ ఈవో పోస్టులు మరియు 666 ఎం ఈ ఓ పోస్టులను నూతనంగా సర్వీస్ రూల్స్ తో సంబంధం లేకుండా 100% జిల్లాపరిషత్ వారితోనే నియామకం చేసేలా శాంక్షన్ చేయించుటకు కృషి చేస్తామని తెలిపారు.

 జె ఎల్స్ మరియు డైట్ లెక్చరర్స్ విషయం గురించి అడగగా న్యూ ఎడ్యుకేషన్ పాలసీ క్రింద ఎన్ని జూనియర్ కళాశాలలు ఏర్పాటు జరుగుచున్న కారణంగా ఆ తరువాత  ప్రభుత్వ ప్రతిపాదనల మేరకు జిల్లా పరిషత్ వారితోనే ఆయా పోస్టులను భర్తీ చేసేలా చర్యలు అని తెలిపారు.

No comments:

Post a Comment

Featured post

AP 10th class public exams result released today