APTF VIZAG: APTET Sylubuss and Exam Pattern and all other information

APTET Sylubuss and Exam Pattern and all other information

టెట్‌ పాఠ్య ప్రణాళికలో మార్పులు.ఐటీ, పర్యావరణం, ఆంగ్లానికి ప్రాధాన్యం.నాలుగు పేపర్లుగా నిర్వహణ

ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) పాఠ్యప్రణాళికలను పాఠశాల విద్యాశాఖ మార్పు చేసింది. జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా కొత్త ప్రణాళికలో ఐటీ, పర్యావరణం, ఆంగ్ల పాఠ్యాంశాలను అదనంగా చేర్చారు. రాష్ట్రంలో ఇప్పటికే 1-6 తరగతుల పాఠ్యపుస్తకాలు మారినందున ఈ పాఠ్యప్రణాళికే ఉంటుంది. మిగతా తరగతులకు సంబంధించిన పాత పాఠ్యపుస్తకాల నుంచే ప్రశ్నలు ఇస్తారు.

https://aptet.apcfss.in/Documents/APTET%202021%20Syllabus.pdf


కరోనా కారణంగా డిజిటల్‌, సాంకేతిక విద్యకు ప్రాధాన్యం పెరిగినందున ఈసారి బహుళ ప్రసార సాధనాలు (ఐసీటీ) సబ్జెక్టును చేర్చారు. పిల్లల అభివృద్ధి, పెడగాజీలో 2018 సంవత్సరం పాఠ్యప్రణాళికతో పోల్చితే 2021లో కొన్ని నూతన పాఠ్యాంశాలు చేర్చారు. ఐసీటీలో 12 పాఠ్యాంశాలను పొందుపర్చారు. ఐసీటీ రెండో విభాగంలో జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా వచ్చిన మార్పులు, కేంద్ర ప్రభుత్వ విధానాలు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తీసుకొచ్చే మార్పులను చేర్చారు. పాఠ్యప్రణాళికను http://aptet.apcfss.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు సంయుక్త సంచాలకులు రవీంద్రనాథ్‌రెడ్డి తెలిపారు.

టెట్‌ను 1ఎ, 1బీ, 2ఎ, 2బీ పేపర్లుగా నిర్వహిస్తారు. 1ఎ 1-5 రెగ్యులర్‌ ఎస్జీటీ ఉపాధ్యాయులకు ఉంటుంది. 1బీని ప్రత్యేక పాఠశాలల ఉపాధ్యాయులకు నిర్వహిస్తారు. 2ఎ స్కూల్‌ అసిస్టెంట్లకు, 2బీ పేపర్‌ 6-8 ప్రత్యేక పాఠశాలల ఉపాధ్యాయులకు ఉంటుంది.

 1ఎ, 1బీ పేపర్లలో 150 మార్కులకు 150 బహుళైచ్ఛిక ప్రశ్నలు ఉంటాయి. పిల్లల అభివృద్ధి, పెడగాజీ, భాష-1, 2, గణితం, పర్యావరణంపై ప్రశ్నలు ఇస్తారు. పరీక్ష సమయం 2 గంటలు.

 పేపర్‌- 2ఎలోనూ 150 మార్కులకు 150 ప్రశ్నలు ఉంటాయి. పిల్లల అభివృద్ధి, పెడగాజీ, భాష-1,2తోపాటు స్కూల్‌ అసిస్టెంట్‌ అభ్యర్థుల సబ్జెక్టు ఉంటుంది. సబ్జెక్టు నుంచి 60 మార్కులకు ప్రశ్నలు ఇస్తారు.

 పేపర్‌- 2బీలో పిల్లల అభివృద్ధి, పెడగాజీ, భాష-1,2తోపాటు 60 మార్కులకు దివ్యాంగుల స్పెషలైజేషన్‌ విభాగం, పెడగాజీ ఉంటుంది.

టెట్‌లో అర్హత సాధించాలంటే జనరల్‌ అభ్యర్థులు కనీసం 60%, బీసీలు 50%, ఎస్సీ, ఎస్టీలు, దివ్యాంగులు, మాజీ సైనికోద్యోగులు 40% మార్కులు తెచ్చుకోవాలి.

No comments:

Post a Comment

Featured post

Ap open school 10th Class and intermediate results