APTF VIZAG: సుప్రీం కోర్టు లో ఏపి 10th ఇంటర్ ఎగ్జామ్స్ కేసు:విచారణ రేపటికి వాయిదా.పూర్తి సమాచారంతో మళ్ళీ అఫిడవిట్ దాఖలు చేయాలన్న సుప్రీం కోర్టు

సుప్రీం కోర్టు లో ఏపి 10th ఇంటర్ ఎగ్జామ్స్ కేసు:విచారణ రేపటికి వాయిదా.పూర్తి సమాచారంతో మళ్ళీ అఫిడవిట్ దాఖలు చేయాలన్న సుప్రీం కోర్టు

ఇంటర్‌పరీక్షలను జులైలో నిర్వహించేందుకు అనుమతివ్వాలంటూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌పై సుప్రీం కోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. పరీక్షల నిర్వహణే ఆలోచనగా ఉండొద్దని, సిబ్బంది, విద్యార్థుల రక్షణ కోణంలోనూ ప్రభుత్వం ఆలోచించాలని తెలిపింది. ఒక్కరు చనిపోయినా.. ఒక్కొక్కరికీ రూ.1 కోటి పరిహారం ఇవ్వాల్సి ఉంటుందని హెచ్చరించింది. మన నిర్ణయాలు భవిష్యత్‌ తరాలకు మార్గదర్శకంగా ఉండాలని వ్యాఖ్యానించింది. జులై చివరిలో పరీక్షలు నిర్వహిస్తామన్నారు. కానీ నిర్ధిష్టమైన తేదీని చెప్పలేదని పేర్కొంది. 15 రోజుల ముందుగా టైం టేబుల్‌ ఇస్తే.. .ఆ సమయం సరిపోతుందని ఎలా చెప్తారని ప్రశ్నించింది. ‘‘ పరీక్షల నిర్వహణకు సహకరించే ఇతర సిబ్బందికి సంబంధించిన వివరాలేవీ ఇవ్వలేదు. ప్రభుత్వమే అన్ని రకాల లాజిస్టిక్‌ వసతులు కల్పించాలి. విద్యార్థులకే కాదు.. సిబ్బందికి కూడా రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది’’ అని సుప్రీం వ్యాఖ్యానించింది.

సరైన గాలి, వెలుతురు ఉండే పరీక్షలు నిర్వహించే గదుల వివరాలేవీ అఫిడవిట్‌లో లేవని చెప్పింది. ఏపీ ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం  సుమారు 28వేల గదులు అవసరం అవుతాయని అభిప్రాయపడింది.

No comments:

Post a Comment

Featured post

AP 10th class public exams result released today