SBI గృహ రుణ వడ్డీ రేట్లు రూ.30 లక్షలకు 6.70 శాతం, రూ.30 లక్షలు నుంచి రూ.75 లక్షల వరకు 6.95 శాతం, రూ.75 లక్షలకుపైగా రుణాలను తీసుకునే వారికి 7.05 శాతం వద్ద గృహ రుణాలు లభిస్తాయని బ్యాంక్ ప్రకటించింది.
బ్యాంకు గృహ రుణ పోర్ట్‌ఫోలియో రూ.5 లక్షల కోట్ల మైలు రాయిని ఫిబ్రవరిలోనే చేరిందని.. దీన్ని రానున్న ఐదేళ్లలో రూ.10 లక్షల కోట్లకు చేర్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎస్‌బీఐ తెలిపింది. 2024 ఆర్థిక సంవత్సరం నాటికి ఇది రూ.7లక్షల కోట్లకు చేరే అవకాశం ఉందని అంచనా వేసింది.
No comments:
Post a Comment