APTF VIZAG: NEP 2020 అమలు లో భాగంగా రాష్ట్ర విద్యా శాఖ జారీ చేసిన సర్కులర్ 172 తేదీ.31.05.21 నందలి కొన్ని ముఖ్యాంశాలు.

NEP 2020 అమలు లో భాగంగా రాష్ట్ర విద్యా శాఖ జారీ చేసిన సర్కులర్ 172 తేదీ.31.05.21 నందలి కొన్ని ముఖ్యాంశాలు.

వచ్చే విద్యా సంవత్సరం నుండి  రాష్ట్రంలో మూడు రకాల  పాఠశాలలు  మాత్రమే ఉంటాయి.

 1.Pre Primary (PP1,PP2)

 2.Foundation(Preparatory 1,1,2)

 3.High Schools(3 to 10/12)

 ఇకపై ప్రైమరీ స్కూల్స్ లో 2 వ తరగతి వరకు మాత్రమే ఫౌండేషనల్ స్కూల్స్ గా  ఉంటాయి....   అంగన్వాడీ లు YSR  ప్రీ ప్రైమరీ స్కూల్స్ గా పనిచేస్తాయి.

ఫౌండేషనల్ స్కూల్స్ లో 1,2 తరగతులకు  ఒక SGT మాత్రమే ఉంటారు .

 ఏ పాఠశాలల నుండి 3 నుండి 5 తరగతులు షిఫ్ట్ అవుతాయో ఆ తరగతులు భోదించే ఉపాధ్యాయులు కూడా హైస్కూల్ కు షిఫ్ట్ అవుతారు.

 3 కి.మీ. పరిధి లోని ప్రాధమిక పాఠశాలలలోని 3 నుండి 5 తరగతులు  అన్నీ సమీప UP / హైస్కూల్ లో Merge అవుతాయి.

 3 నుండి 5   తరగతులు కలవడం వల్ల UP స్కూల్స్ లో రోల్ 150  దాటితే వాటిని హైస్కూల్స్ గా చేస్తారు.

 Habitation  లో 1 కి.మీ పరిధిలో ఫౌండేషనల్ స్కూల్స్ ,  3 కి.మీ. పరిధిలో Secondary స్కూల్స్ విద్యార్థులకు అందుబాటులో వుండాలి.

 ప్రైమరీ   స్కూల్స్ లో  1:30 రేషియోలో ఉపాధ్యాయులు ఉంటారు... ఆ పై స్థాయిలలో 1:35, 1:40 రేషియోలో ఉపాధ్యాయులు ఉంటారు.

No comments:

Post a Comment