APTF VIZAG: NEET PG EXAMS POSTPONED

NEET PG EXAMS POSTPONED

NEET PG పరీక్షలు 4నెలలు వాయిదా. కరోనా ఉగ్రరూపం కొనసాగుతున్న వేళ కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నీట్‌ పీజీ పరీక్షలను 4 నెలల పాటు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. ఏప్రిల్‌ 18న ఈ పరీక్ష జరగాల్సి ఉండగా.. యువ వైద్య విద్యార్థుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని వాయిదా వేస్తున్నట్టు ఇటీవల కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్దన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా ఆ పరీక్షలను మరో నాలుగు నెలల పాటు వాయిదా వేస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కొవిడ్‌ చికిత్సలో సిబ్బంది కొరత రాకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. 100 రోజులు కొవిడ్‌ విధుల్లో ఉన్న పీజీ విద్యార్థులకు ప్రభుత్వ వైద్య నియామకాల్లో ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించింది.

No comments:

Post a Comment