ఇక కొత్త e-filing పోర్టల్.
★ ఆదాయపు పన్ను శాఖ కొత్త వెబ్ ఈ-ఫైలింగ్ పోర్టల్‌ను జూన్ 7న ఆవిష్కరించబోతోంది.
★ చెల్లింపుదారులు తమ ఆదాయపు పన్ను రిటర్ను (ఐటీఆర్)లను మరింత తేలికగా, ఎటువంటి ఆటంకాలు లేకుండా దాఖలు చేసుకోవచ్చు.
Click Here To New Income Tax Website
★ ఆదాయపు పన్ను శాఖకు సంబంధించిన ప్రస్తుత వెబ్ పోర్టల్స్ జూన్ ఒకటి నుంచి ఆరు వరకు ప్రజలకు అందుబాటులో ఉండవని,ఈ ఆరు రోజులపాటు వీటిని షట్ డౌన్ చేస్తామని అధికారులు తెలిపారు.
★ ఆదాయపు పన్ను శాఖ సిస్టమ్స్ వింగ్ తెలిపిన సమాచారం ప్రకారం, పాత పోర్టల్ www.incometaxindiaefiling.gov.inను మార్చి కొత్త పోర్టల్ www.incometaxgov.inను అభివృద్ధిపరిచారు.
★ దీనికి సంబంధించిన తుది కార్యక్రమాలు పూర్తయి, జూన్ 7 నుంచి ప్రజలకు అందుబాటులోకి వస్తుంది.
★ కొత్త పోర్టల్‌కు సంబంధించిన సమస్యలను వినడానికి లేదా పరిష్కారం కోసం జూన్ 10 నుంచి సమయం ఇవ్వాలని ఆదాయపు పన్ను శాఖ అధికారులకు సూచనలు అందాయి.
వ్యక్తిగత, వ్యాపార సంస్థల ఐటీ రిటర్నులను దాఖలు చేయడానికి* కొత్త పోర్టల్‌ను ఉపయోగించవచ్చు. అదేవిధంగా *రిఫండ్ కోరడం, ఇతర సమస్యల పరిష్కారం కోసం* కూడా దీనిని ఉపయోగించుకోవచ్చు.
No comments:
Post a Comment