YSR ఆరోగ్యశ్రీ పథకం కింద కొవిడ్-19 వైద్యం అందించబడు ఆసుపత్రులకు చికిత్స ప్యాకేజీ ధరలు పెంచుతూ ఉత్తర్వులు విడుదల చేసిన ఏపి రాష్ట్ర ప్రభుత్వం.
రాష్ట్రంలో కరోనా ఉద్ధృతంగా వ్యాపిస్తున్న తరుణంలో ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో కొవిడ్ చికిత్స ఫీజును నిర్ణయిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. సాధారణ చికిత్సకు ఎన్‌ఏబీహెచ్ ఆస్పత్రుల్లో రోజుకు రూ.4 వేలు, ఎన్‌ఏబీహెచ్ ఆమోదం లేని ఆస్పత్రుల్లో రూ.3,600 ఫీజు నిర్ణయించింది. సాధారణ కొవిడ్ చికిత్స, ఆక్సిజన్ కలిపి ఎన్‌ఏబీహెచ్ ఆస్పత్రుల్లో రూ.6,500, ఇదే చికిత్సకు ఆమోదం లేని ఆస్పత్రుల్లో రూ. 5,850 ఫీజు వసూలు చేయనున్నారు. క్రిటికల్, ఐసీయూ,ఎన్‌ఐవీ చికిత్సకు ఎన్‌ఏబీహెచ్ ఆస్పత్రుల్లో రూ.12వేలు, ఆమోదం లేని ఆస్పత్రుల్లో రూ.10,800 ఫీజుగా నిర్ధరించారు. ఐసీయూ (వెంటిలేటర్) చికిత్సకు ఎన్‌ఏబీహెచ్ ఆస్పత్రుల్లో రూ.16వేలు, నాన్ ఎన్‌ఏబీహెచ్ ఆస్పత్రుల్లో రూ.14,400 ఫీజు నిర్ణయించారు.
No comments:
Post a Comment