APTF VIZAG: ఆంధ్రప్రదేశ్ లో పదవ తరగతి పరీక్షలు వాయిదా వేసిన ప్రభుత్వం.జూలైలో పరిస్థితి సమీక్షించి తదుపరి నిర్ణయం తీసుకోనున్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ లో పదవ తరగతి పరీక్షలు వాయిదా వేసిన ప్రభుత్వం.జూలైలో పరిస్థితి సమీక్షించి తదుపరి నిర్ణయం తీసుకోనున్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం

విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆరోగ్య భద్రత దృష్టిలో పెట్టుకుని సీఎం జగన్ 10 వ తరగతి పరీక్షలు వాయిదా వేయాలని ఆదేశించారని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు.
 గురువారం మీడియాతో మాట్లాడుతూ కరోనా పరిస్థితి చక్కబడ్డాక తిరిగి పరీక్షల నిర్వహణపై నిర్ణయం తీసుకుంటామని,త్వరలోనే పరీక్షల షెడ్యూల్ ప్రకటిస్తామని అన్నారు. 
ఉన్నత చదువులకు ఇంటర్, టెన్త్ పరీక్షలు చాలా అవసరమని తెలిపారు. విద్యార్థులు నష్ట పోకుండా పరీక్షలు నిర్వహించాలని చూస్తున్నట్లు మంత్రి చెప్పారు. 
కేంద్ర ప్రభుత్వం కూడా సీబీఎస్ఈ పరీక్షల నిర్వహణకు కసరత్తు చేస్తోందన్నారు. సీబీఎస్ఈ పరీక్షలు నిర్వహించాలని కూడా తాము కోరినట్లు తెలిపారు. 
10వ తరగతి విద్యార్థులకు ఆన్‌లైన్ ద్వారా క్లాసులు ఉంటాయని. తల్లిదండ్రులు ఆందోళన పడాల్సిన అవసరం లేదని తెలిపారు.
ఉపాధ్యాయులు కూడా కరోనాకు ప్రాణాలు కోల్పోయారన్నారు. పరీక్షలు వాయిదా పడిన నేపథ్యంలో టీచర్లు కూడా స్కూల్స్‌కి రావాల్సిన అవసరం లేదని చెప్పారు.

No comments:

Post a Comment

Featured post

Know your transfer application status