సీబీఎస్‌ఈ బోర్డుతో ఒప్పందం.ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధనతోపాటు విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు సీబీఎస్‌ఈ బోర్డుతో ప్రభుత్వం ఒప్పందం(ఎంవోయూ) కుదుర్చుకోనుంది. రాష్ట్రంలో 44,639 ప్రభుత్వ పాఠశాలలను దశలవారీగా అనుసంధానించే ప్రక్రియతోపాటు ఇంగ్లీష్ మీడియంలోనే విద్యాబోధన కొనసాగుతుంది. ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులతోపాటు విద్యా సంస్థల అధికారులు సీబీఎస్‌ఈ సిలబస్, ఆ పరీక్షల నిర్వహణ తీరును అలవర్చుకునేలా తగిన అవగాహన కల్పిస్తారు.
2021–22 విద్యా సంవత్సరంలో ఏడో తరగతి విద్యార్థులు తొలిసారి సీబీఎస్‌ఈ సిలబస్‌తో పరీక్షలు రాయనుండగా, 2024 – 25లో పదో తరగతి విద్యార్థులు సీబీఎస్‌ఈ సిలబస్‌తో తొలిసారి పరీక్షలు రాస్తారు. ఒకవైపు విద్యా ప్రమాణాల పెంపు మరోవైపు నాడు–నేడు పనులతో పాఠశాలల రూపురేఖలు సమూలంగా మారడంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో కొత్తగా 6.12 లక్షల మంది విద్యార్థులు చేరగా వారిలో 4 లక్షల మందికిపైగా విద్యార్థులు ప్రైవేటు విద్యా సంస్థల నుంచి వచ్చినవారు కావడం విశేషం.
No comments:
Post a Comment