APTF VIZAG: ఒక కిలోమీటర్ దూరంలోపే ఫౌండేషన్ స్కూళ్లు.3 కిలోమీటర్ల దూరంలోపే హైస్కూల్ ప్రీప్రైమరీ , ప్రైమరీలో ఉత్తమ బోధన లక్ష్యాలు అందుకే ఫౌండేషన్ స్కూళ్లు : సీఎం జగన్

ఒక కిలోమీటర్ దూరంలోపే ఫౌండేషన్ స్కూళ్లు.3 కిలోమీటర్ల దూరంలోపే హైస్కూల్ ప్రీప్రైమరీ , ప్రైమరీలో ఉత్తమ బోధన లక్ష్యాలు అందుకే ఫౌండేషన్ స్కూళ్లు : సీఎం జగన్

పిల్లల్లో ఆరేళ్ల వయ సులోపే 80 శాతం మేధో వికాసం చెందుతుంది . అందుకే ఈ ఆలోచన . నిరుపేద విద్యార్థులకు కూడా అత్యుత్తమ ప్రమాణాలతో విద్యను అందించాలని నా తపన , ఆరాటం . ఆ ఆలోచనల నుంచి పుట్టు కొచ్చినవే ఈ వైఎస్సార్ ప్రీప్రైమరీ స్కూళ్లు , ఫౌండేషన్ స్కూళ్లు . ఇది కాకుండా ప్రస్తుతం ఉన్న హైస్కూళ్లలో 11 , 12 తరగతులను పెట్టడమా ? లేక మండలానికి ఒక జూనియర్ కాలేజీ పెట్టాలా ? అన్నదానిపై పూర్తిస్థాయి పరిశీలన చేయండి .

ఈనిర్ణయం వల్ల 11 , 12 తరగతులకు ప్రభుత్వ రంగంలోనే మంచి విద్య అందించే అవ కాశం ఉంటుంది ' అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు . ప్రీప్రైమరీ , ప్రైమరీ విద్యాబోధనపై విద్యాశాఖ , మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులతో గురువారం సీఎం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు . ఇప్పుడు ఏర్పాటు చేయదలచిన ఫౌండేషన్ స్కూళ్లు అన్నీ పిల్లలకు ఒక కిలోమీటర్ దూరంలోపే ఉండాలి . అలాగే అన్ని హైస్కూళ్లు ( 8 వ తరగతి నుంచి 10 లేదా 12 వ తరగతి ) 3 కిలోమీటర్ల దూరం లోపు ఉండాలి . వైఎస్సార్ ప్రీప్రైమరీ స్కూళ్లు పిల్లలకు చాలా దగ్గరగా ఉండాలి . టీచర్లలోని బోధనా సామర్థ్యాన్ని మరింత వినియోగించుకునేలా చర్యలు చేపట్టాలి . తద్వారా పిల్లలకు అత్యుత్తమ విద్యను అందించవచ్చు ' అని సీఎం పేర్కొన్నారు . డిజిటల్ బోధన ప్రక్రియపై దృష్టి పెట్టండి . మనం బ్లాక్ బోర్డు నుంచి గ్రీన్ బోర్డులకు మారాం . ఇక ముందు డిజిటల్ బోర్డులకు వెళ్లే పరిస్థితి వస్తుంది . డిజిటల్ బోర్డులు దీర్ఘకాలం మన్నికగా ఉండేలా చూసుకోండి ' అని సీఎం జగన్ నిర్దేశించారు

No comments:

Post a Comment

Featured post

AP 10th class public exams result released today