2019-21 బ్యాచ్ కు చెందిన డిప్లమో ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్మూడో సెమిస్టర్ పరీక్షలకు సంబంధించిన పరీక్ష ఫీజులను జూన్ 2వ తేదీలోగా చెల్లించాలి.ఎలాంటి అపరాధ రుసుం లేకుండా జూన్ 2లోగా, రూ.50 ఆలస్య అపరాధ రుసుంతో జూన్ 4వ తేదీ వరకు చెల్లించేందుకు వెసులుబాటు ఉంది.పరీక్ష ఫీజులను కళాశాలల ప్రిన్సిపాల్స్, పేమెంట్ గేట్ వే ద్వారా మాత్రమే చెల్లింపు చేయాల్సి ఉంటుంది.
వెబ్ లింక్ మే 19 నుంచి అందుబాటులోకి వస్తుంది
జూలై 12 నుంచి పరీక్షలు.
ముందస్తుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం 2019-21 బ్యాచ్ కు చెందిన డైట్ మూడో సెమిస్టర్ పరీక్షలు జూలై 12వ తేదీన మొదలు కానున్నాయి. 17వ తేదీ వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. ప్రతి రోజు ఉదయం 9 నుంచి 11.30 వరకు జరుగుతాయి.
No comments:
Post a Comment