ఏపీ లో పదోతరగతి పరీక్షల సమయం పెంపు. ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే 11 పరీక్షలను ఆరుకు కుదించిన సర్కార్ తాజాగా పరీక్షలు రాసే సమయాన్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.ఈ మేరకు ప్రభుత్వం సవరణ ఉత్తర్వులు జారీ చేసింది.
మొదటి, ద్వితీయ, తృతీయ భాష పరీక్షలకు సమయాన్ని పొడిగించారు.
గణితం, సామాజిక శాస్త్రం, భౌతికశాస్త్రం, జీవశాస్త్రం పరీక్షలకు అరగంట సమయాన్ని పెంచారు.
భాషలు, గణితం, సామాజిక శాస్త్రానికి 100 మార్కుల ప్రశ్నా పత్రాలు, భౌతికశాస్త్రం, జీవశాస్త్రం పరీక్షలకు 50 మార్కుల ప్రశ్నా పత్రాలు ఉండనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.
కంపోజిట్ కోర్సులోని రెండో భాష (పేపర్-2)కు 1.45 గంటలు, ఒకేషనల్ కోర్సు పరీక్షకు 2 గంటల సమయాన్ని పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది
No comments:
Post a Comment