పరిషత్ ఎన్నికలపై ఏపీ హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై తాజాగా ఎస్‌ఈసీ జారీ చేసిన నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ భాజపా, జనసేన దాఖలు చేసిన పిటిషన్లపై ఉన్నత న్యాయస్థానంలో వాదనలు జరిగాయి. ఎన్నికల ప్రక్రియ ఆగిన చోట నుంచే కొనసాగిస్తున్నట్లు ఎస్‌ఈసీ తరఫు న్యాయవాది వివరించారు. పోలింగ్, ఓట్ల లెక్కింపు ప్రక్రియ మాత్రమే మిగిలి ఉందని చెప్పారు. ఎన్నికల నిర్వహణకు ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు.. తీర్పును రిజర్వ్ చేసింది. దీనిపై ఉన్నత న్యాయస్థానం ఎల్లుండి తీర్పు వెల్లడించనుంది.
No comments:
Post a Comment