ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ ఖాళీల వివరాల సేకరణ కొనసాగుతోంది. వివిధ శాఖల్లో గ్రూపు-1, 2 3, 4, ఇతర కేటగిరీల వారీగా ఉద్యోగ ఖాళీల వివరాలను ఈ నెల 12వ తేదీ మధ్యాహ్నం 12లోపు పంపించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్ ఇటీవల ఆదేశించారు. ఖాళీల వివరాల సేకరణకు ప్రత్యేకంగా ఓ నమూనాను ఆయన వివిధ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులకు పంపారు. మరో రెండు రోజుల్లో ఉద్యోగ ఖాళీల వివరాలను ఆన్‌లైన్ ద్వారా సీఎస్‌కు పంపేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఉద్యోగాల భర్తీపై ఉగాదినాడు అధికారిక ప్రకటన వస్తుందని నిరుద్యోగులు ఎదురుచూస్తున్న నేపథ్యంలో ఈ కసరత్తు ప్రాధాన్యం సంతరించుకుంది.
అవసరమైతేనే భర్తీ
క్యారీఫార్వర్డ్, నాన్-జాయినింగ్ పోస్టుల వివరాలనూ సేకరిస్తున్నారు. గుర్తించిన ఖాళీలను ఒకేసారి కాకుండా.. దశల వారీగా భర్తీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దశాబ్దాల కిందట మంజూరైన పోస్టులను యథాతథంగా కొనసాగించకుండా ప్రస్తుత అవసరాలకు తగ్గట్లు అవసరమైతేనే భర్తీ చేయాలని ఉన్నతస్థాయిలో సమాలోచనలు జరుగుతున్నాయి.
No comments:
Post a Comment