APTF VIZAG: Census 2021 Postponed Due To COVID

Census 2021 Postponed Due To COVID

కోవిడ్ వల్ల జనగణన-2021 వాయిదా

కోవిడ్-19 వల్ల జనగణన-2021 సంబంధిత పనులు వాయిదా పడ్డాయని కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు చెందిన జనరల్ కార్యాలయం తెలిపింది. రాష్ట్రాలవారీగా జనగణన 2021 ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలియజేయాలంటూ విజయవాడకు చెందిన ఇనగంటి రవికుమార్ సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేశారు. దీనికి సమాధానమిచ్చిన రిజిస్ట్రార్ జనరల్ కార్యా లయం జనగణనకు సంబంధించి తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఇదే పరిస్థితి ఉంటుందని తెలిపింది. కొత్త తేదీలను నిర్ణయిం చలేదని వివరించింది.

జనగణన-2021 కోసం 2010 జనవరి 1 నుంచి 2019 డిసెం బర్ 31 వరకు ఉన్న మ్యాపింగ్ ను, సరిహద్దులను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉందని, అయితే కోవిడ్-19 వల్ల జనగణన వాయిదా పడిందని పేర్కొంది. ఈ నేపథ్యంలో మార్చి 31, 2021 వరకు ఈ తేదీ ని పొడిగించామని జనగణన పూర్తయ్యే వరకు మ్యాపింగ్ సరిహద్దుల్లో మార్పులు చేయొద్దని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్రం ఆదేశించిందని తెలిపింది.

No comments:

Post a Comment

Featured post

Ap open school 10th Class and intermediate results