రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో శని, ఆదివారాల్లో వడగా ల్పులు తీవ్రంగా వీచే అవకాశముందని విపత్తుల నిర్వ హణ శాఖ హెచ్చరించింది. 62 మండలాల్లో 42.5-43,5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చని తెలిపింది. భా రత వాతావరణ శాఖ ఈ మేరకు వెల్లడించినట్టు పే ర్కొంది. శ్రీకాకుళం జిల్లా భామిని, తూర్పుగోదావరి జి ల్లా అడ్డతీగల, రాజవొమ్మంగి, పశ్చిమగోదావరి జిల్లా కుక్కునూరు మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీస్తాయ ని తెలిపింది.
కోస్తా లోని మరో 58 మండలాల్లో 39-42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చని పేర్కొంది. వడ గాల్పుల హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు ముందు జా గ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ శాఖ సూ చించింది. కాగా రాష్ట్రం మీదుగా ఈశాన్య, తూర్పు గా లులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో ఈనెల 21, 22 తేదీల్లో అక్కడ క్కడ వర్షం లేకుండా ఉరుములు, మెరుపులు రావచ్చ ని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో మాత్రం పొడి వాతావరణం ఉంటుందని పేర్కొంది. శుక్రవారం రాయలసీమ ప్రాంతంలో పగటి ఉష్ణోగ్రతలు 36-37 డిగ్రీలు కోస్తాంధ్రలో 33-35 డిగ్రీలు, మిగిలిన ప్రాంతాల్లో డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి
No comments:
Post a Comment