APTF VIZAG: ఆగస్టు 15న విలేజ్‌ క్లినిక్‌లు ప్రారంభం: జగన్‌

ఆగస్టు 15న విలేజ్‌ క్లినిక్‌లు ప్రారంభం: జగన్‌

మే నాటికి గ్రామ సచివాలయాల నిర్మాణం పూర్తి కావాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఉపాధి హామీ పనులు, గ్రామ సచివాలయ, ఆర్బీకేలు, ఏప్రిల్‌, మే నెలలో అమలు చేయనున్న పథకాలపై కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. రికార్డు స్థాయిలో ఉపాధి హామీ పనులు చేపట్టినందుకు ఈ సందర్భంగా అధికారులను అభినందించారు. కొవిడ్‌ వంటి మహమ్మారిని ఎదుర్కోవడానికే విలేజ్‌ క్లినిక్‌లు తీసుకొస్తున్నట్లు సీఎం చెప్పారు. యుద్ధప్రాతిపదికన వాటి నిర్మాణం పూర్తి చేసి ఆగస్టు 15న ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

రాష్ట్రవ్యాప్తంగా 9,899 చోట్ల బల్క్‌ మిల్క్‌ కూలింగ్‌ (బీఎంసీ) సెంటర్లను ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. సెప్టెంబర్‌ నెలలో బీఎంసీలను ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. అలాగే 25 ప్రాసెసింగ్‌ యూనిట్ల కోసం భూములను గుర్తించాలని.. ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గంలో ఒక యూనిట్‌ చొప్పున ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అర్హులకు 90 రోజుల్లోగా ఇంటి పట్టా ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. మిగిలిపోయిన 1,69,558 ఇళ్ల పట్టాలను వెంటనే పంపిణీ చేయాలని సీఎం జగన్‌ ఆదేశించారు.

No comments:

Post a Comment