పంచాయతీల ఏకగ్రీవానికి ప్రోత్సాహకాలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
◆రూ.20 లక్షల వరకు ప్రోత్సాహకాలు ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.
◆2 వేల లోపు పంచాయతీలకు 5 లక్షలు, 2 నుంచి 5 వేల జనాభా కలిగిన పంచాయతీలకు రూ.10 లక్షలు. 5 వేల నుంచి 10 వేల జనాభా కలిగిన పంచాయితీలకు 15 లక్షల ప్రోత్సాహకాలు ప్రభుత్వం ప్రకటించింది.
15 వేల జనాభా దాటిన పంచాయితీలు ఏకగ్రీవం అయితే 20 లక్షల ప్రోత్సాహకాలు ప్రకటించింది.
ప్రభుత్వం శాంతియుతంగా ఏకగ్రీవం అయిన పంచాయతీలకు ఈ ప్రోత్సాహకాలు ప్రకటిస్తూ గతంలో ఉత్తర్వులు ఇచ్చింది.
ప్రస్తుత పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఈ ప్రోత్సాహకాలకు విస్తృతంగా ప్రచారం కల్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్య నాథ్ దాస్ ఆదేశాలు జారీ చేశారు.
No comments:
Post a Comment