జేఈఈ మెయిన్ దరఖాస్తు గడువు పెంపు: వచ్చే నెల 23వ తేదీ నుంచి జరిగే జేఈఈ మెయిన్ మొదటి విడతకు దరఖాస్తు చేసుకునే గడువును ఈనెల 23వ తేదీ వరకు పెంచుతున్నట్లు జాతీయ పరీక్షల మండలి(ఎన్‌టీఏ) శనివారం ప్రకటించింది. వచ్చే విద్యాసంవత్సరం(2021-22) నుంచి యూపీలోని గోరఖ్‌పూర్‌లో మదన్‌మోహన్ మాలవ్య సాంకేతిక విశ్వవిద్యాలయం కూడా జేఈఈ మెయిన్ ర్యాంకుల ద్వారా ప్రవేశాలు కల్పించేందుకు ముందుకు వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.
ముందుగా ప్రకటించిన కాలపట్టిక ప్రకారం శనివారంతో గడువు ముగిసింది. దరఖాస్తుల్లోని పొరపాట్లను ఈనెల 27 నుంచి 30వ తేదీ వరకు సవరించుకోవచ్చని, ఫిబ్రవరి 2వ వారం నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఎన్‌టీఏ పేర్కొంది.
No comments:
Post a Comment