RJD SE / DEO లకు DSE AP వారి తాజా ఉత్తర్వులు.
ప్రతి జిల్లాలో ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించిన కోర్ట్ వారి మధ్యంతర ఉత్తర్వులు / కౌంటర్ ల దాఖలు / స్టే వెకేట్ చేయుట / రిట్ అప్పీళ్లు.. తదితర అంశాలను విస్తృతంగా గమనిస్తూ.... అట్టి వానిని వెంటనే 25.01.2021 లోపు DSE AP వారి దృష్టికి తీసుకురావలెను.
ది.25.01.2021 తర్వాత వచ్చు పెండింగ్ కోర్ట్ కేసుల అమలును అనుమతించబడవు మరియు కంటెంప్ట్ క్రింద ఏదైనా కేసు ఫెయిల్ అయినట్లయితే సంబంధితులపై చర్యలు తీసుకొనబడును.
కొంతమంది HM లు / టీచర్స్..... వారికి 5 సం / 8 సం ల సర్వీస్ పూర్తి అయినప్పటికీ ఇంకనూ బదిలీ కొరకు దరఖాస్తు చేయని వారు ఇంకనూ మిగిలిఉన్నట్లుగా కొందరు DEO లు తమ దృష్టికి తెచ్చియున్నారనీ.. అట్టివారిని మిగిలిపోయిన కేటగిరీ III & IV పాఠశాలలకు బదిలీ చేయడంతో పాటు వానిపై క్రమశిక్షణా చర్యలు తీసుకొనబడును.
ఎవరైనా ఇరువురు ఉపాధ్యాయులు సింగిల్ పోస్ట్ లో నియమించబడితే... సీనియర్ టీచర్ ని అక్కడే ఉంచి జూనియర్ టీచర్ ని సమీప పాఠశాలలో నియమించాలి
No comments:
Post a Comment