ఐటీ రిటర్నుల దాఖలు గడువు పొడిగింపు. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఆదాయ పన్ను రిటర్నుల దాఖలు గడువును కేంద్రం పొడిగించింది.
వ్యక్తిగత పన్ను రిటర్నుల దాఖలు గడువు రేపటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో గడువును జనవరి 10వ తేదీ వరకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కంపెనీలు ఆదాయ పన్ను రిటర్నుల దాఖలు చేసే గడువును కూడా ఫిబ్రవరి 15వ తేదీ వరకు (15 రోజులు) పొడిగించింది.
No comments:
Post a Comment