APTF VIZAG: CBSE Board Announced Exams Dates,CBSE పరీక్షల తేదీలను ప్రకటించిన కేంద్రం.

CBSE Board Announced Exams Dates,CBSE పరీక్షల తేదీలను ప్రకటించిన కేంద్రం.

సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షల షెడ్యూల్‌ను కేంద్రం విడుదల చేసింది. ఈ పరీక్ష తేదీలను కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ ప్రకటించారు. 

✅మే 4 నుంచి జూన్‌ 10 వరకు పరీక్షలు నిర్వహిస్తామన్నారు.మార్చి 1 నుంచి ప్రాక్టికల్స్‌ ఉంటాయని చెప్పారు. 

✅జూలై 15న పరీక్ష ఫలితాలు విడుదల చేయనున్నట్టు వెల్లడించారు.

✅కరోనా వైరస్‌తో పాటు కొత్త స్ట్రెయిన్‌ కలకలం నేపథ్యంలో అనేకమంది విద్యార్థులు పరీక్షలను వాయిదా వేయాలని మంత్రిని ట్విటర్‌ వేదికగా అభ్యర్థించారు.

✅పరీక్షలపై సన్నద్ధతకు మరికొంత గడువు ఇచ్చేలా మే నెలలో పరీక్షలు నిర్వహించాలంటూ కోరారు. ఇంటర్నెట్‌ కనెక్టివిటీ సరిగా లేకపోవడంతో ఆన్‌లైన్‌ తరగతులు సరిగా జరగడంలేదని వాపోయారు.

✅దీంతో విద్యార్థుల అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకున్న కేంద్రం.. మే 4 నుంచి సీబీఎస్‌ఈ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది.

No comments:

Post a Comment

Featured post

Learn a word a day 23.03.2024 words list for level 1 2 3 4