APTF VIZAG: FAFTO Discussion with govt

FAFTO Discussion with govt

ఈరోజు ఉపాధ్యాయ బదిలీల పై విద్యాశాఖ మంత్రి ఏర్పాటుచేసిన జాక్టో, ఫ్యాప్టో టీచర్ల సంఘాల సమావేశంలో మంత్రి గారి తో పాటు పాఠశాల విద్యా కమిషనర్ చిన్న వీరభద్రుడి గారు, జెడి సర్వీసెస్ దేవానంద్ రెడ్డి గారు పాల్గొన్నారు. ఈ సమావేశంలో  తీసుకున్న నిర్ణయాలు

మాన్యువల్ కౌన్సిలింగ్ విషయంలో వెబ్ కౌన్సెలింగ్ డెమో ఇచ్చి వివరణ ఇచ్చాక నిర్ణయం తీసుకోవటం జరుగుతుంది.

33 సంవత్సరాల సర్వీసుకు 0.5  ప్రకారం పాయింట్లు       ఇస్తారు.

సర్వీస్ పోయింట్ల సీలింగ్ తొలగింపు.  చైల్డఇన్ఫో లోపలు సరిచేస్తారు.తప్పు చేసిన వారిపై క్రమశిక్షణ చర్యలు.  2019 అప్గ్రేడ్ పోస్ట్స్ కోర్ట్ తీర్పు ప్రకారము నిర్ణయం చేస్తారు.  పోస్ట్స్ బ్లాక్ చేసే విషయంలో అవసరం ను బట్టి  బ్లాక్ చేస్తారు.

బదిలీలలో తప్పుడు సర్టిఫికెట్లు సమర్పిస్తే, శిక్షలు తప్పవని స్పష్టం చేసిన గౌరవ కమిషనర్ అంగీకరించిన సంఘాలు.

జాక్టో పక్షాన పాల్గొన్నవారు... జాక్టో చైర్మన్ కేశవరపు జాలిరెడ్డి, జాక్టో వర్కింగ్ చైర్మన్ శ్రావణ్ కుమార్ , సెక్రటరీ జనరల్ మల్లు శ్రీధర్ రెడ్డి ,  జాక్టో నాయకులు అశోక్ కుమార్ రెడ్డి, మాగంటి శ్రీనివాస రావు , దుర్గా దాసు,  శ్రీనివాసరావు పాల్గొన్నారు..

No comments:

Post a Comment

Featured post

AP 10th class public exams result released today