APTF VIZAG: GOMS-57 dt:30-10-20 School Education Department – COVID -19 - Private Un-Aided Schools / Junior colleges - Fee to be collected from parents /students for the Academic year 2020-21

GOMS-57 dt:30-10-20 School Education Department – COVID -19 - Private Un-Aided Schools / Junior colleges - Fee to be collected from parents /students for the Academic year 2020-21

ప్రైవేటు విద్యాసంస్థల్లో ఫీజులు 30% తగ్గింపు.గతేడాది ఫీజులో 70శాతమే  వసూలు చేయాలి.పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు.

Click Here To Download GO No. 54

 ప్రైవేటు పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలు గతేడాది వసూలు చేసిన ట్యూషన్‌ ఫీజులో 70శాతమే తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీచేసింది. పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ సూచన ప్రకారం ఈ విషయం నిర్ణయించింది. కరోనా ప్రభావం అన్ని రంగాలపై పడిందని, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఫీజులను చెల్లించే పరిస్థితుల్లో లేరని పేర్కొంది. అన్‌లాక్‌ నిబంధనలతో ఇప్పుడిప్పుడే ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోందని, సాధారణ ప్రజలు, మధ్యతరగతి వారు ఆర్థిక సమస్యల్లో ఉన్నారని, అందుకే ట్యూషన్‌ ఫీజులో 30% తగ్గిస్తున్నట్లు పేర్కొంది.

పాఠశాలలు మార్చి 23 నుంచి మూతపడ్డాయి. ఇప్పటివరకు పునఃప్రారంభం కాలేదు. దీంతో నిర్వహణ ఖర్చులు తగ్గాయి.

నవంబరు 2నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. సాధారణ రోజులతో పోల్చితే ఐదు నెలలు పని చేయలేదు. దీనికి అనుగుణంగా ఖర్చులు తగ్గాయి.

కేంద్రం ఇచ్చిన ప్రత్యామ్నాయ కేలండర్‌ను అమలు చేశారు. ఆన్‌లైన్‌ బోధన మాత్రమే అందించారు.

మిగతా నెలలకు పాఠశాల విద్యాశాఖ పాఠ్యాంశాలను తగ్గించనుంది. పాఠశాల బస్సులకు కొంత మొత్తమే వ్యయం కానుంది.

No comments:

Post a Comment

Featured post

Ap open school 10th Class and intermediate results