ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా తదితర కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఏపీ ఎంసెట్-2020 ఫలితాలు శనివారం విడుదల కానున్నాయి.
విజయవాడ ఆర్ అండ్ బీ భవనంలో ఉదయం 10 గంటలకు విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ఫలితాలను ప్రకటిస్తారు. ఎంసెట్ ఫలితాలను శుక్రవారం విడుదల చేయాలని ముందు భావించారు.
అయితే ఫలితాలకు సంబంధించి ఎలాంటి పొరపాట్లు చోటుచేసుకోకుండా ఉండేందుకు పునఃపరిశీలన కార్యక్రమాన్ని చేపట్టడంతో విడుదలను శనివారానికి వాయిదా వేశారు.
ఇంటర్మీడియెట్ మార్కులను 25 శాతానికి తీసుకొని ఎంసెట్ మార్కులకు కలిపి ర్యాంకులను నిర్ధారించాల్సి ఉంది. ముఖ్యంగా నార్మలైజేషన్ ప్రక్రియను చేపట్టి విద్యార్థులకు ఎక్కడా అన్యాయం జరగకుండా పలు జాగ్రత్తలు తీసుకున్నారు.
ఫలితాల కోసం
https://sche.ap.gov.in/eamcet/EamcetHomePages/Home.aspx
andhrajyothi.com
No comments:
Post a Comment