APTF VIZAG: మాస్క్‌లు ధరించకపోతే ప్రమాదంలో పడినట్టే దేశ ప్రజలనుద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ఏడోసారి ప్రసంగం

మాస్క్‌లు ధరించకపోతే ప్రమాదంలో పడినట్టే దేశ ప్రజలనుద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ఏడోసారి ప్రసంగం

 
కరోనాతో భారత్ పోరాటం చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశంలో కరోనా రికవరీ రేటు చాలా బాగుందని తెలిపారు. మరణాల రేటు తక్కువగా ఉందని పేర్కొన్నారు. కరోనా విజృంభణ నేపథ్యంలో జాతినుద్దేశించి ఆయన ప్రసంగించారు. 

కరోనా కట్టడే లక్ష్యంగా విధించిన జనతా కర్ఫ్యూ విధించినప్పటి నుంచి ఇప్పటివరకు ఆయన జాతినుద్దేశించి చేసిన ప్రసంగాల్లో ఇది ఏడోది. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. కరోనా టెస్టింగ్‌ కోసం 2వేల ల్యాబ్‌లు పనిచేస్తున్నాయని మోదీ చెప్పారు. ప్రతి 10లక్షల మందిలో ఐదున్నర వేల మందికే కరోనా సోకిందన్నారు. అదే అమెరికా, బ్రెజిల్‌ లాంటి దేశాల్లో అయితే 10 లక్షల మందిలో 25వేల మందికి సోకిందని పేర్కొన్నారు.

పండుగల సీజన్‌ సమీపిస్తున్న వేళ ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మోదీ కీలక సూచనలు చేశారు. ‘‘త్వరలోనే కరోనా పరీక్షల సంఖ్య 10 కోట్లు దాటిపోతుంది. పరీక్షల సంఖ్య పెంచడంలో వైద్య వ్యవస్థ అత్యంత వేగంగా పనిచేసింది. వైద్యులు, నర్సులు, వైద్య సిబ్బంది సేవాభావంతో పనిచేశారు. కరోనా తగ్గుముఖం పట్టిందని నిర్లక్ష్యంగా ఉండొద్దు. కరోనా దేశం నుంచి విడిచిపోయిందనే భావన రానీయొద్దు. 

కరోనా తగ్గిందని భావిస్తే తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది. కరోనా పోయిందని మాస్కులు ధరించకపోతే ప్రమాదంలో పడినట్టే. యూరప్‌, అమెరికా పరిణామాలు చూస్తే నిర్లక్ష్యం కూడా ప్రమాదకరంగా మారొచ్చు’’ అని అన్నారు.

No comments:

Post a Comment

Featured post

AP 10th class public exams result released today