★ ఈ విద్యాసంవత్సరం నుంచి అంగన్‌వాడీ కేంద్రాల్లో వైఎస్సార్ ప్రీప్రైమరీ తరగతులను ప్రభుత్వం ప్రారంభించనుంది.
★ ప్రస్తుతం రాష్ట్రంలో 55 వేల అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. వీటిలో దశలవారీగా ప్రీప్రైమరీ విధానానికి శ్రీకారం చుట్టనున్నారు.
బోధన, క్లాసులు ఇలా
★ టీచర్లకు హా‍్యండ్‌బుక్‌తో పాటు పిల్లలకు నాలుగేసి బొమ్మల పుస్తకాలను ఎస్‌సీఈఆర్టీ రూపొందించింది.
★ 3 సెమిస్టర్లుగా ఇవి ఉంటాయి. జూన్-సెప్టెంబర్, అక్టోబర్-డిసెంబర్, జనవరి-మార్చిగా విభజించి ఆ మేరకు హ్యాండ్‌బుక్‌ను రూపొందించారు.
★ పీపీ1, పీపీ2 పిల్లల కోసం వేర్వేరుగా బొమ్మల రూపంలో ఉన్న ఫన్‌బుక్, రైమ్స్ బుక్, స్టోరీ బుక్, వర్క్ బుక్ తయారుచేస్తున్నారు.
★ టీచర్లకు ఇచ్చే హ్యాండ్‌బుక్‌లో పాఠ్యాంశాలు పిల్లలకు ఎలా చెప్పాలో సూచనలు ఇస్తారు.
★ ఇంగ్లిష్, తెలుగు అక్షరమాల, అంకెలతో పాఠ్యపుస్తకాలు ఉంటాయి. పీపీ1లో పరిచయం చేసిన వాటినే పీపీ2లో కొంచెం వివరంగా చూపిస్తూ నేర్పిస్తారు.
★ పదినెలల బోధనా కాలంలో నెలకో అంశాన్ని బోధించేలా పుస్తకాలు రూపొందించారు.
★ టీచర్లు ఆ అంశాల గురించి చెబుతున్నపుడు వర్కుబుక్‌లో పిల్లలతో వాటిని గుర్తు పట్టేలా చేస్తారు.
★ పీపీ1 పిల్లలకు మౌఖికంగా తరగతులుంటాయి. పీపీ2లో రాతకు సంబంధించిన నైపుణ్యాన్ని అలవడేలా చేస్తారు.
★ ఉదయం 9-15కి తరగతులు ప్రారంభమవుతాయి. ఒక్కోటి అరగంట సేపు చొప్పున మొత్తం 6 పీరియడ్లుంటాయి. మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు భోజనం, విశ్రాంతికి సమయం ఇస్తారు.
★ తరువాత 2 నుంచి 3 వరకు క్లాసులు కొనసాగించి 3.10కి ఇళ్లకు పంపిస్తార.
No comments:
Post a Comment