PVC ఆధార్ కార్డు కొరకు మనం ఆన్లైన్ లో అప్లై చేసుకుని 50 రూపాయలు ఆన్లైన్ లోనే పే చేసినట్లయితే మన ఇంటికే ప్లాస్టిక్ ఆధార్ కార్డు పోస్టు ద్వారా పంపిస్తారు.
PVC ఆధార్ కార్డు కొరకు మనం ఏం చేయాలి అనే వివరాలను స్క్రీన్ షాట్ ద్వారా వివరించడం జరిగింది.
ముందుగా మీరు క్రింది లింక్ ను క్లిక్ చేయండి.
https://residentpvc.uidai.gov.in/order-pvcreprint
ఇలా లింక్ ఓపెన్ చేయగానే క్రింద చూపిన విధంగా విండో ఓపెన్ అవుతుంది.
ఇందులో మనం మన ఆధార్ నెంబర్ ను, క్రింద ఇచ్చిన కోడ్ నెంబరు ని ఎంటర్ చేయాలి.మీరు ఇంతకు ముందు మీ ఫోన్ నెంబర్ మీ ఆధార్ నెంబర్ తో లింక్ అయి ఉంటే మీరు SEND OTP పై క్లిక్ చేయండి లేకపోతే మీరి కింద చెక్ బాక్స్ లో టిక్ చేసి మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి SEND OTP పై క్లిక్ చేయగానే మీ మొబైల్ కి OTP వస్తుంది.
OTP ని ఎంటర్ చేయగానే మనది రిజిస్టర్డ్ మొబైల్ అయితే ఆధార్ ప్రివ్యూ చూపిస్తుంది.రిజిష్టర్డ్ మొబైల్ కాకపోతే ఆధార్ కార్డు వివరాల ప్రివ్యూ చూపించదు.
ఇలా మన వివరాలు చూపించిన తరువాత క్రింద పేమెంట్ ఆప్షన్ ఉంటుంది.దాని పైన క్లిక్ చేయగానే డెబిట్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, పోన్ పే వంటి ఆప్షన్ లులో సెలెక్ట్ చేసుకుని పేమెంట్ చేయాలి.
ఇలా చేయగానే మనకి ఓక నెంబరు జనరేట్ అవుతుంది.మన కార్డు స్టేటస్ ను క్రింది లింక్ ద్వారా తెలుసుకోవచ్చు.
No comments:
Post a Comment