APTF VIZAG: Cabinet Meeing Decissions On 03-09-2020

Cabinet Meeing Decissions On 03-09-2020


03-09-2020 న జరిగిన  ఏపీ కేబినెట్ మంత్రివర్గ నిర్ణయాలు
రాష్ట్రంలో ఆన్‌లైన్‌ రమ్మీ, పోకర్‌ వంటి జూద క్రీడలపై నిషేధం
నిర్వాహకులు మొదటిసారి పట్టుబడితే ఏడాది జైలు, రెండోసారి పట్టుబడితే రెండేళ్ల జైలు, జరిమానా
ఆన్‌ లైన్‌ జూదం ఆడుతూ పట్టుబడితే ఆరునెలల జైలు
వైఎస్సార్‌ ఉచిత విద్యుత్‌ నగదు బదిలీ పథకానికి కేబినెట్‌ ఆమోదం
డిసెంబర్‌ 1 నుంచి శ్రీకాకుళం జిల్లాలో పైలట్‌ ప్రాజెక్టుగా ఉచిత విద్యుత్‌ నగదు బదిలీ పథకం అమలు
వచ్చే ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉచిత విద్యుత్‌ నగదు బదిలీ పథకం అమలు
రాష్ట్ర ఫీడర్ల అప్‌గ్రేడేషన్‌కు రూ.1700 కోట్లు ఇవ్వాలని కేబినెట్‌ నిర్ణయం
పగటి పూట 9 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వాలని కేబినెట్‌ నిర్ణయం
రాష్ట్రంలో ఉన్న లక్ష అనధికార ఉచిత విద్యుత్‌ కనెక్షన్ల క్రమబద్ధీకరణకు కేబినెట్‌ ఆమోదం
భూమిని కౌలుకిచ్చిన రైతులకూ ఉచిత విద్యుత్‌ పథకం అమలు చేయాలని నిర్ణయం
విద్యుత్‌ బకాయిల చెల్లింపు బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలని నిర్ణయం
రాష్ట్రంలో ఎండీవోలకు డీడీవోలుగా ప్రమోషన్‌ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం
రాష్ట్రంలో స్టేట్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం
ప్రకాశం బ్యారేజీ దిగువన 3 టీఎంసీల సామర్ధ్యంతో మరో రెండు బ్యారేజీల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
రూ.1350 కోట్ల ఖర్చుతో కృష్ణానదిపై చోడవరం వద్ద బ్యారేజీ నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం
రూ. 1280 కోట్లతో మోపిదేవి వద్ద కృష్ణానదిపై మరో బ్యారేజీ నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం
రూ.15380 కోట్లతో ఉత్తరాంధ్రలోని మెట్టప్రాంతాల కోసం బాబూజగజ్జీవన్ రామ్‌ సుజల స్రవంతి పథకం
బాబూజగజ్జీవన్ రామ్‌ సుజల స్రవంతి పథకంతో 8 లక్షల ఎకరాలకు లబ్ది
రాయలసీమ కరువు నివారణ పథకం కింద 14 పనులకు త్వరిత గతిన పూర్తి చేయాలని నిర్ణయం
బాపట్ల, మార్కాపురంలో మెడికల్‌ కాలేజీ ఏర్పాటు కోసం స్ధల కేటాయింపుకు కేబినెట్‌ ఆమోదం
మావోయిస్టులపై మరో ఏడాది నిషేధం పొడిగింపు
పశ్చిమగోదావరి జిల్లాలో ఏపీ ఫిషరీస్‌ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కేబినెట్‌ పచ్చజెండా

No comments:

Post a Comment