APTF VIZAG: Union Budjet 2020-21

Union Budjet 2020-21

2020 -2021 బడ్జెట్
ఆదాయపన్ను చెల్లింపుదారులకు ఊరట కలిగించేలా బడ్జెట్‌ 2020-21లో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మధ్య, ఎగువ మధ్య తరగతి వారికి ఊరటనిచ్చేలా ఆదాయపన్ను శ్లాబులను 4 నుంచి 7కు పెంచింది.
కొత్త ఆదాయపు పన్ను స్లాబుల లో ఉన్న మెలిక

🔷80(సి) కింద వచ్చే మినహాయింపులు రావు

♦కొత్త ఆదాయ పన్ను విధానం ఐచ్ఛికం అని తెలిపారు. మినహాయింపులు పొందాలా? వద్దా? అన్నది వేతన జీవుల నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. దీంతో పాత విధానంతో పాటు కొత్త విధానమూ అమల్లో ఉంటుంది. *కొత్త ట్యాక్స్‌ విధానం ఎంచుకుంటే 80(సి) కింద వచ్చే రూ.1.50,000/-మినహాయింపులు రావు.*

♦కొత్త విధానం స్లాబులు

రూ. 2.5 లక్షలలోపు ఆదాయమున్న వారికి పన్ను నుంచి మినహాయింపు
1)రూ. 2.5 లక్షల1నుంచి రూ. 5 లక్షల వరకు ఆదాయమున్న వారికి 5 శాతం పన్ను 
2) రూ. 5 నుంచి 7.5 లక్షల ఆదాయమున్నవారికి 10శాతం పన్ను . 
3)రూ. 7.5 నుంచి 10 లక్షల ఆదాయమున్న వారికి 15శాతం,
4) రూ. 10 నుంచి 12 లక్షల ఆదాయమున్న వారికి 20 శాతం, 
5)రూ. 12.5 నుంచి రూ. 15 లక్షల ఆదాయమున్న వారికి 25 శాతం, 
 6)రూ. 15 లక్షల కన్నా ఎక్కువ ఆదాయమున్నవారికి 30 శాతం

పాత విధానం స్లాబులు
Taxble Income రు 5 లక్ష లు మించని వారికి మనము pay చేయవలసిన టాక్స్ నుండి రు 12,500/- మినహాయింపు లభిస్తుంది.

1.రు. 2,50,000/- వరకు పన్ను లేదు

2.రు. 2,50,000/- నుండి రు 3,00,000/- వరుకు 5 శాతం

3. రు 3,00,000/- నుండి రు 5,00,000/- వరకు రు 2,500+5 శాతం

4.రు 5,00,000/- నుండి రు 10,00,000/- వరకు రు 12,500 +20 శాతం

5. రు 10,00,000/-లకు పైన రు 1,10,000+30 శాతం

కేంద్ర బడ్జెట్-2020 హైలెట్స్
భారత్‌ ఇప్పుడు ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ

2006-16 మధ్య పేదరికం నుంచి 22 కోట్లమంది బయటపడ్డారు

ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన ద్వారా పేదలందరికి ఇళ్ల నిర్మాణం

2019లో కేంద్రంపై రుణభారం 48.7 శాతం తగ్గింది

284 బిలియన్‌ డాలర్ల స్థాయికి ఎఫ్‌డీఐలు చేరాయి

జీఎస్టీ శ్లాబ్‌ల తగ్గింపుతో సామాన్యులకు మేలు జరిగింది
మూడు ప్రాధాన్యాంశాలతో ముందుకు:

మొదటి ప్రాధాన్యాంశం: వ్యవసాయం, సాగునీరు గ్రామీణాభివృద్ధి

ద్వితీయ ప్రాధాన్యాంశం: ఆరోగ్యం, పారిశుద్ధ్యం, తాగునీరు

మూడో ప్రాధాన్యాంశం: విద్య, చిన్నారుల సంక్షేమం
 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపునకు కట్టుబడి ఉన్నాం

ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన ద్వారా 6.11 కోట్ల మంది రైతులకు ప్రయోజనం

పప్పు ధాన్యాల సాగు విస్తీర్ణం పెంచడంపై దృష్టి సారించాం

కృషి సించాయి యోజన ద్వారా సూక్ష్మ సాగునీటి విధానాలకు ప్రోత్సాహం

గ్రామీణ సడక్‌ యోజన, ఆర్థిక సమ్మిళిత రైతులకు ఎంతో మేలు చేస్తున్నాయి

పొలాలు, రైతుల ఉత్పాదకత పెంచడం ద్వారా ప్రయోజనం
గ్రామీణ మహిళలకు ధాన్యలక్ష్మి

ముద్ర స్కీమ్‌ ద్వారా గ్రామీణ మహిళలకు సాయం
గ్రామీణ మహిళలకు ధాన్యలక్ష్మి పేరుతో నూతన స్కీం
నాబార్డు ద్వారా రీఫైనాన్స్‌ పునరుద్ధరిస్తాం
జీవన మార్పులతో వచ్చే రోగాల నివారణకు నూతన పథకం.

 సాగర్ మిత్ర పథకంలలో

 గ్రామీణ యువ రైతులకు మత్స్య పెంపకంలో ప్రోత్సాహం.
బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి పెద్దపీట

రూ 15 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలు
వ్యవసాయ, గ్రామీణాభివృద్ధికి రూ 2.83 లక్షల కోట్లు
పంచాయితీరాజ్‌కు రూ 1.23 లక్షల కోట్లు
ఆరోగ్య రంగానికి రూ 69,000 కోట్లు
స్వచ్ఛభారత్‌ మిషన్‌కు రూ 12,300 కోట్లు
పైప్‌డ్‌ వాటర్‌ ప్రాజెక్టుకు రూ 3.6 లక్షల కోట్లు
త్వరలో కొత్త విద్యా విధానం : నిర్మలా సీతారామన్

న్యూ ఢిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశ పెడుతున్నారు.

 15వ ఆర్థిక సంఘం నివేదికను నిర్మల సభ ముందుంచారు. 2030 నాటికి ప్రపంచంలో ఎక్కువ మంది ఉద్యోగార్హులు ఉంటారని ఆమె స్పష్టం చేశారు. త్వరలోనే కొత్త విద్యా విధానం అమల్లోకి వస్తుందని కేంద్రమంత్రి తెలిపారు. మార్చి నాటికి 150 విద్యాసంస్థల్లో వృత్తి విద్యాకోర్సులు రానున్నాయన్నారు.

ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకు ఇంటర్న్‌షిప్ ఉంటుందన్నారు.

వైద్య రంగానికి రూ.69 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు ఆమె తెలిపారు. పేద విద్యార్థులకు పూర్తి స్థాయిలో ఆన్‌లైన్ విద్య అందించబోతున్నామని శుభవార్త చెప్పారు.

త్వరలోనే నేషనల్ పోలీస్, నేషనల్‌ ఫోరెన్సిక్ సైన్స్ విశ్వవిద్యాలయాల ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. వైద్య కళాశాల, జిల్లా కేంద్ర ఆస్పత్రుల్లో పీపీపీ విధానం అనుసంధానం చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు.
విద్యారంగంలో *ప్రైవేటు* పెట్టుబడులు

విద్యారంగంలో ప్రైవేటు పెట్టుబడులకు అనుమతి.

జల్‌జీవన్‌ మిషన్‌కు రూ 11,500 కోట్లు
*విద్యారంగానికి రూ 99.300 కోట్లు*
నైపుణ్యాభివృద్ధికి రూ 3,000 కోట్లు
కొత్తగా ఐదు స్మార్ట్‌ సిటీల అభివృద్ధి
నేషనల్‌ టెక్నికల్‌ టెక్స్‌టైల్‌ మిషన్‌ ఏర్పాటుకు రూ1480 కోట్లు
పరిశ్రమలు, వాణిజ్య రంగానికి రూ 27,300 కోట్లు
చిన్న ఎగుమతిదారుల కోసం నిర్విక్‌ పథకం
త్వరలో జాతీయ లాజిస్టిక్స్‌ పాలసీ

No comments:

Post a Comment

Featured post

AP 10th class public exams result released today