👭పాఠశాలల్లో నో బ్యాగ్ డే..👭
విధి విధానాలను ప్రకటించిన విద్యాశాఖ
విద్యార్థులకు కృత్యాధార విద్య
సామాజిక అంశాలపై అవగాహన కల్పించేలా అభ్యాసాలు
👭తరగతుల వారీగా కార్యక్రమాలు👭
స్కూలు బ్యాగులు లేకుండా పాఠశాలలకు వచ్చిన విద్యార్థులతో ఉదయం నుంచి సాయంత్రం వరకు చేసే కార్యక్రమాలను తరగతుల వారీగా నిర్ణయించారు నో బ్యాగ్ డే శనివారం నాలుగు ప్రధాన పిరియడ్లుగా విభజించి కార్యక్రమాలను అమలు చేస్తారు.
👭1, 2 తరగతుల విద్యార్థులకు..👭
🚶మొదటి పిరియడ్ పాడుకుందాం.. ఇందులో అభినయ, జానపద, దేశ భక్తి గేయాలు, శ్లోకాలు వంటివి పిల్లలతో పాడించాలి.
🚶రెండో పిరియడ్ .. మాట్లాడుకుందాం.. కథలు చెప్పడం పుస్తకాలలో కఽథలను చదవడం తమ అనుభవాలను తెలియజేయడం, పొదుపు కథలు పజిల్స్, సరదా ఆటలు ఆడించడం పిల్లలతో చేయించాలి.
🚶మూడో పిరియడ్.. నటిద్దాం.. నాటికలు లఘు నాటికలు (స్కిట్స్) మూకాభినయాలు, ఏకపాత్రాభినాయాలు, నృత్యాలు వంటివి ప్రదర్శించవలసి ఉంటుంది.
🚶నాలుగో పిరియడ్.. సృజన.. పిల్లలలో సృజనాత్మక కళలను అభివృద్ధి చేసేందుకు వివిధ కార్యక్రమాలను అమలు చేయవలసి ఉంటుంది. బొమ్మలు గీయడం రంగులు వేయడం, బంకమట్టిని ఉపయోగించి బొమ్మలు నమూనాలు తయారు చేసే కార్యక్రమాలను చేపట్టాలి
👭3,4,5 తరగతుల విద్యార్థులకు👭
🚸నో బ్యాగ్ డే కార్యక్రమాలను మూడు, నాలుగు, అయిదు తరగతులకు వినూత్నంగా చేపట్టేందుకు కార్యక్రమాన్ని నిర్ణయించారు.🚸
🚶మొదటి పిరియడ్.. సృజన : ఇందులో బొమ్మలు వేయడం, రంగులు దిద్దడం వంటి పనులతో పాటు మూకాభినయాలు వంటివి చేయించాలి. మాస్కులతో నాటికలు వేయించడం, అలంకరణ వస్తువులు తయారు చేయడం, నృత్యాలు చేయించడం వంటి పనులు చేయాలి.
🚶రెండో పిరియడ్.. తోటకుపోదాం.. పరిశుభ్రత చేద్దాం... : ఈ కార్యక్రమంలో బడి తోటలో మొక్కలను సంరక్షించడం, పాదులు, కలుపు మొక్కలు తీయడం, ఎరువులు వేయడం, నీరు పెట్టడం, తరగతి గదలను శుభ్రంగా ఉంచడం వంటి పనులు చేయించాలి.
🚶మూడో పిరియడ్ .. చదువుకుందాం : ఇందులో పాఠశాల గ్రంథాలయంలో ఉన్న పుస్తకాలను ఎంపిక చేసుకుని పిల్లలు చదవడం అందులో కథలను ఇతర అంశాలను ఇతర పిల్లలతో చర్చించడం చిన్న కథలు రాయడం వంటి పనులు చేయాలి
🚶నాలుగో పిరియడ్.. విందాం విందాం : ఈ కార్యక్రమంలో ప్రాఽథమిక ఆరోగ్య కార్యకర్త, పంచాయతీ కార్యదర్శి వ్యవసాయాధికారి, పోస్టుమాస్టరు, వ్యాపారి, వ్యవసాయదారులను పాఠశాలకు ఆహ్వానించి వారితో వారికి సంబంధించిన కార్యక్రమాలను పిల్లలకు చెప్పించాలి

No comments:
Post a Comment