APTF VIZAG: EBC RESERVATION BILL కి రాష్ట్రపతి ఆమోద ముద్ర...గెజిట్ విడుదల చేసిన కేంద్రం

EBC RESERVATION BILL కి రాష్ట్రపతి ఆమోద ముద్ర...గెజిట్ విడుదల చేసిన కేంద్రం

ఈబీసీ రిజర్వేషన్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం
🔹ఈబీసీ రిజర్వేషన్ బిల్లు చట్టరూపం దాల్చింది.
🔹ఆర్థిక బలహీనవర్గాల రిజర్వేషన్ల బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు.
🔹ఇకపై ఆర్థిక బలహీనవర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు కలగనున్నాయి.
🔹రెండు రోజుల క్రితమే ఈబీసీ బిల్లుకు లోక్ సభ, రాజ్యసభ ఆమోదం తెలపగా.. ఇప్పుడు రాష్ట్రపతి కూడా ఆమోదం తెలిపారు.
🔹దీంతో ఈబీసీలకు పదిశాతం రిజర్వేషన్ బిల్లు చట్టంగా మారింది.
     ఈబీసీల రిజర్వేషన్లు ఎవరికి వర్తిస్తాయంటే
ఆర్థికంగా వెనుకబడిన వర్గంలోకి ఎవరెవరు వస్తారన్నదానిపై ప్రభుత్వం స్పష్టమైన నిర్వచనం ఇచ్చింది. ప్రతిపాదిత ప్రామాణికాల ప్రకారం ఎవరు ఈ వర్గంలోకి వస్తారంటే..
➡వృత్తిపరంగా, వ్యవసాయ పరంగా వార్షికాదాయం రూ.8 లక్షల కన్నా తక్కువ ఉన్నవారు...
➡అయిదెకరాల కన్నా తక్కువ వ్యవసాయ భూమి, 1,000 చదరపు అడుగుల కన్నా తక్కువ విస్తీర్ణం ఉన్న ఇల్లు కలిగి ఉన్నవారు...
➡నోటిఫైడ్‌ మున్సిపల్‌ ప్రాంతాల్లో 100 గజాల కన్నా తక్కువ స్థలంలో ఇల్లు ఉన్నవారు..
➡నాన్‌-నోటిఫైడ్‌ మున్సిపల్‌ ప్రాంతంలో 200 గజాలకన్నా తక్కువ స్థలంలో ఇల్లు ఉన్నవారు రిజర్వేషన్‌ పొందేందుకు అర్హులు.
➡విద్య, ఉద్యోగ రంగాల్లో దీనిని వర్తింపజేస్తారు. 10 శాతం కోటా వల్ల బ్రాహ్మణులు, రాజ్‌పుట్‌లు, జాట్లు, మరాఠాలు, భూమిహార్‌లు, వైశ్య, కమ్మ, కాపు, రెడ్డి, క్షత్రియ వంటి పలు సామాజిక వర్గాలు లబ్ధి పొందనున్నాయి.
➡ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన వర్గాలకున్న 49.5% రిజర్వేషన్లకు ఇది అదనం. అంటే రిజర్వేషన్లు 59.5% అవుతాయి.
Download Gezette click here 

No comments:

Post a Comment

Featured post

AP 10th class public exams result released today