APTF VIZAG: Sajjala ramakrishna REDDY explained teachers recruitment

Pages

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; MDM SOFTWARE ; CCE 1TO 5TH SOFTWARE ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

Sajjala ramakrishna REDDY explained teachers recruitment

ఆ తర్వాతే టీచర్ల  భర్తీ ప్రక్రియ

★నూతన విద్యా విధానం అమల్లోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వ చర్యలు తీసుకుంటోందని,  ఈ విధానం ప్రారంభమైన తర్వాత ఉపాధ్యాయ ఖాళీలపై స్పష్టత వస్తుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు

★ఆ తర్వాతే టీచర్ల భర్తీ ప్రక్రియ చేపడతామన్నారు.ఒక్క పాఠశాల కూడా మూతపడకుండా నూతన విద్యా విధానాన్ని ఏపీ ప్రభుత్వం అమలు చేస్తుందని చెప్పారు. 

★ప్రస్తుతం 8 వేల ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉండాల్సిన పరిస్థితి ఉందని, నూతన విద్యా విధానంలో ఈ సమస్య పరిష్కారమవుతుందని చెప్పారు. 

 ★విద్యారంగంలో జగన్‌ ప్రభుత్వం  ప్రాధాన్యత క్రమంలో ముందుకు వెళ్తోందన్నారు. 

★గత రెండేళ్లలో దేశంలో ఎక్కడా లేని విధంగా 1,83,480 రెగ్యులర్ ఉద్యోగాలను భర్తీ చేసినట్లు ఆయన వివరించారు. 

★జాబ్ క్యాలెండర్‌లో పోస్టుల సంఖ్య తగ్గిందని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారనీ, ఇకపై ప్రతి సంవత్సరం జాబ్ కేలండర్ విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. 

★వచ్చే ఏడాది  పోస్టుల సంఖ్య పెరగవచ్చన్నారు.రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడుస్తోందని వివరించారు.

No comments:

Post a Comment

Featured post

Ap open school 10th Class and intermediate results