APTF VIZAG: ITD has launched a mobile app ‘AIS for Taxpayers’ to enable taxpayers to view their info as available in Annual Information Statement(AIS)/Tax Information Summary(TIS).This will provide enhanced taxpayer service & ease of compliance.

Pages

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; MDM SOFTWARE ; CCE 1TO 5TH SOFTWARE ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

ITD has launched a mobile app ‘AIS for Taxpayers’ to enable taxpayers to view their info as available in Annual Information Statement(AIS)/Tax Information Summary(TIS).This will provide enhanced taxpayer service & ease of compliance.

పన్ను..ఆదాయం వివరాలన్నీ యాప్‌లో. అందుబాటులోకి ‘ఏఐఎస్‌ ఫర్‌ ట్యాక్స్‌పేయర్‌’. ఆదాయపు పన్ను విభాగం వెల్లడి.

https://play.google.com/store/apps/details?id=io.lntinfotech.AIStaxpayer

 పన్ను చెల్లింపుదారులకు మరింత సౌకర్యవంతంగా ఉండేలా మొబైల్‌ యాప్‌ను తీసుకొచ్చినట్లు ఆదాయపు పన్ను విభాగం వెల్లడించింది. ‘ఏఐఎస్‌ ఫర్‌ ట్యాక్స్‌పేయర్‌’ పేరుతో ఈ యాప్‌ గూగుల్‌ ప్లే, యాప్‌స్టోర్‌లో అందుబాటులో ఉందని బుధవారం ఐటీ విభాగం తెలిపింది. దీన్ని ఉచితంగానే వినియోగించుకోవచ్చు. ఈ మొబైల్‌ యాప్‌ ద్వారా పన్ను చెల్లింపుదారులు తమ వార్షిక సమాచార నివేదిక (యాన్యువల్‌ ఇన్ఫర్మేషన్‌ స్టేట్‌మెంట్‌- ఏఐఎస్‌), పన్ను చెల్లింపుదారు సమాచారం (ట్యాక్స్‌పేయర్‌ ఇన్ఫర్మేషన్‌ సమ్మరీ - టీఐఎస్‌) చూసుకునేందుకు వీలవుతుంది.


ఏఐఎస్‌లో పన్ను చెల్లింపుదారుడికి లభించిన అన్ని ఆదాయ వివరాలూ ఉంటాయి. వేతనం ద్వారా పొందిన ఆదాయం, డివిడెండ్లు, వడ్డీ, షేర్ల అమ్మకాల ద్వారా వచ్చిన లాభాలు, పన్ను చెల్లింపులు, మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్‌), పన్ను చెల్లింపు (టీసీఎస్‌), ఆదాయపు పన్ను రిఫండుతో పాటు జీఎస్‌టీ, విదేశీ చెల్లింపుల వంటివీ కనిపిస్తాయి. ఇందులో కనిపించే సమాచారంపై ఏమైనా ఫిర్యాదులుంటే దాన్ని నమోదు చేసే వీలునూ యాప్‌లో పొందుపర్చినట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) తెలిపింది.


ఓటీపీలతో...: ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్న తర్వాత.. పాన్‌, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయాలి. ఇప్పటికే మీరు ఇన్‌కంట్యాక్స్‌ పోర్టల్‌లో పేర్కొన్న మొబైల్‌ నెంబరు, ఇ-మెయిల్‌ వివరాలను పేర్కొనాలి. ఈ రెండింటికీ ఇన్‌కంట్యాక్స్‌ నుంచి ఓటీపీలు వస్తాయి. వీటిని అధీకృతం చేసిన తర్వాత, నాలుగు అంకెల పిన్‌ ఏర్పాటు చేసుకుని, మొబైల్‌ యాప్‌ను వాడుకోవచ్చు.

AIS FOR TAX PAYER APP DOWNLOAD LINK

https://play.google.com/store/apps/details?id=io.lntinfotech.AIStaxpayer


No comments:

Post a Comment

Featured post

Ap open school 10th Class and intermediate results