APTF VIZAG: How to update My Adhar Document -2023

Pages

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; MDM SOFTWARE ; CCE 1TO 5TH SOFTWARE ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

How to update My Adhar Document -2023

మన ఆధార్ కార్డ్ ను ఎలా అప్డేట్ చేసుకోవాలి.

👉ఆధార్ కార్డ్ తీసుకుని 10 సంవత్సరాలు అయిన వారందరూ ఈ Adhar Document Updation చేసుకోవాలి

చివరి తేదీ: ఆగస్ట్ 2023 వరకే

👉Self Updation Process

👉ఎలా అప్డేట్ చేసుకోవాలి,దానికి కావలసిన డాకుమెంట్స్ ఏమిటి ?

👉ఈ ఆధార్ అప్డేట్ కి - ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ కి మధ్య వ్యత్యాసం ఏమిటి ?


1) ఆధార్ అప్డేట్ మరియు ఆధార్ డాకుమెంట్స్ అంటే ఏమిటి ?

2) ఈ ఆధార్ డాకుమెంట్ అప్డేట్ ఎవరు చేసుకోవాలి ? 

3) ఈ అప్డేట్ ఎందుకు చేసుకోవాలి ?చివరి తేదీ ఎప్పుడు ?

4) న్యూ ఆధార్ ఎప్పుడు తీసుకున్నామో ఎలా తెలుసుస్తుంది ?

5) ఈ ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ అనేది ఎక్కడ చేసుకోవాలి ?

6) ఈ ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ ఏయే ప్రూఫ్స్ కావాలి ?

7) ఈ ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ క ఎంత ఫీజు ఛార్జ్ చేస్తారు?

1️⃣ ఆధార్ అప్డేట్ మరియు ఆధార్ డాకుమెంట్స్ అంటే ఏమిటి ?


🅰️ ఆధార్ అప్డేట్ అంటే మనం క్రొత్త ఆధార్ తీసుకున్న తర్వాత ఆ ఆధార్ కి సంబంధించి వ్యక్తిగత వివరాలు లేదా చిరునామాకి సంబంధించిన వివరాలు,మరియు బయోమెట్రిక్ ఇలా ఏదైనా మరలా మార్చుకుంటే దానిని "ఆధార్ ని అప్డేట్" చేసుకోవడం అంటారు.

ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ అంటే ఏమిటంటే 2016 వ సంవత్సరం కి ముందు క్రొత్తగా ఆధార్ తీసుకున్నప్పుడు ఎలాంటి వ్యక్తిగత వివరాలు కి సంబంధించిన డాకుమెంట్ (POI),అదే విధంగా చిరునామా కి సంబంధించిన డాక్యుమెంట్ (POA) ఇలాంటివి ఏమి ఇవ్వకుండా కేవలం ఒక అప్లికేషను తో అప్పుడు క్రొత్త ఆధార్ తీసుకుని వుంటారు.కావున అలాంటి వారు ఇప్పుడు POI,POA కి సంబంధించిన డాకుమెంట్స్ ని ఏవైనా మీ ఆధార్ నెంబర్ కి జత చేసుకోవాలి.దానికోసం పెట్టిందే ఈ ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్.

2️⃣ఈ ఆధార్ డాకుమెంట్ అప్డేట్ ఎవరు చేసుకోవాలి ? 


🅰️ పైన చెప్పిన విధంగా 2010 నుండి 2016 వ సంవత్సరం లోపల ఎవరైతే క్రొత్త ఆధార్ తీసుకుని ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఏదేని డాకుమెంట్స్ ఇచ్చి అప్డేట్ చేసుకోవాలి.


3️⃣ ఈ అప్డేట్ ఎందుకు చేసుకోవాలి?చివరి తేదీ ఎప్పుడు ?

🅰️ ఈ ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ వలన మనం వాడుతున్న ఆధార్ నెంబర్ కి పటిష్ట భద్రత మరియు ఖచ్చితత్వ సమాచారం వుంటుంది. దీనివలన అనేక లావాదేవీలు,సబ్సిడీ లో ఇలా ప్రభుత్వాలు ఇచ్చే అన్ని సర్వీసులు చాలా పారదర్శకంగా,శీఘ్రంగా,అవినీతి లేకుండా చేయడానికి బాగుంటుంది.


దీనికి చివరి తేదీ: ఆగస్ట్,2023 వరకు అవకాశం ఇచ్చారు.ఆ తరువాత అప్డేట్ చేసుకొని ఆధార్ లని క్యాన్సిల్ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కావున ప్రజలందరూ జాగ్రత్త పడగలరు.

4️⃣ న్యూ ఆధార్ ఎప్పుడు తీసుకున్నామో ఎలా తెలుసుస్తుంది ?

🅰️ మనం క్రొత్త ఆధార్ కార్డ్ ఎప్పడు  తీసుకున్నామో అని రెండు రకాలుగా తెలుసుకోవచ్చును.

1) మీ దగ్గర ఉన్న మొదట వచ్చిన ఆధార్ లో ఎడమ వైపున  year వుంటుంది.

2)ఆధార్ అప్డేట్ హిస్టరీ అనే ఒక సర్వీస్ ని ప్రభుత్వం అందుబాటులో  ఉంచింది.దీనిలో అయితే చాలా ఖచ్చితత్వం గా మంజూరు తేదీ  తెలుసుకోవచ్చును.

ఆధార్ అప్డేట్ హిస్టరీ తెలుసుకునే లింక్: ఈ క్రింది లింక్ ద్వారా మీ ఆధార్ ఎంటర్ చేసి,OTP సాయంతో వివరాలను తెలుసుకోవచ్చు.


https://resident.uidai.gov.in/aadhaar-updatehistory

                   

5️⃣ఈ ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ అనేది ఎక్కడ చేసుకోవాలి ?

ఈ ఆధార్ అప్డేట్ డాక్యుమెంట్ని 4 విధాలుగా చేసుకునే అవకాశం కల్పించారు.


1) SELF(స్వీయ)  LINK 

2) ఆధార్ సెంటర్ లలో

3) AP లో అయితే ఆధార్ సర్వీస్ ఉన్న సచివాలయంలో

4) CSC సెంటర్ లలో


6️⃣ఈ ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ ఏయే ప్రూఫ్స్ కావాలి ?


POI (PROOF OF IDENTITY)-2 MB SIZE,

PDF,JPEG,PNG format.


POA (PROOF OF ADDRESS)2 MB SIZE,

PDF,JPEG,PNG format.


7️⃣ఈ ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ కొరకు ఎంత ఫీజు ఛార్జ్ చేస్తారు?

🅰️ ఈ ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ కొరకు కేంద్ర ప్రభుత్వం మొదట్లో ₹ 25/- లు గా నిర్ణయించారు.

ఉచితం::మార్చి 15, 2023 నుండి జూన్ 14,2023 అంటే మూడు నెలల కాలంలో చేసుకున్న వారికి ఉచితంగా చేసుకునే అవకాశం కల్పించారు.

( Online లో చేసుకున్న వారికి మాత్రమే)


 Link:

 https://myaadhaar.uidai.gov.in/

No comments:

Post a Comment

Featured post

Ap open school 10th Class and intermediate results