APTF VIZAG: Change your District Name in APPSC with otpr

Pages

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; MDM SOFTWARE ; CCE 1TO 5TH SOFTWARE ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

Change your District Name in APPSC with otpr

ఓటిపిఆర్ లో మీరు పనిచేసే జిల్లా పేరును అప్డేట్ ఎలా చేయాలో కింది సూచనల ద్వారా తెలియజేయడమైనది

మొదటగా కింద కనబరిచిన లింకును క్లిక్ చేయండి.

https://psc.ap.gov.in/(S(pt1hij3td54ihoifhc5chjg1))/UI/CandidateLoginPages/LoginNew.aspx


పై లింక్ క్లిక్ చేసిన వెంటనే మీకు లాగిన్ పేజీ కనబడుతుంది.

తర్వాత యూజర్ ఐడి దగ్గర మీ ఓటీపీఆర్ నెంబర్ ని టైప్ చేయాలి.

పాస్వర్డ్ దగ్గర మీరు ఇదివరకే సెట్ చేసుకున్న పాస్వర్డ్ ను టైప్ చేయండి.

ఒకవేళ మీరు పాస్వర్డ్ మర్చిపోయి ఉంటే forgot పాస్వర్డ్ పైన క్లిక్ చేసి అక్కడ అడిగిన వివరాలు మీరు సబ్మిట్ చేసి కొత్త పాస్వర్డ్ ను క్రియేట్ చేసుకోవచ్చు.


తర్వాత కింద Enter Captcha దగ్గర captcha కాలంలో మనకు కనబడుతున్న alphabets, Numerics, special charecters కలిపి ఇచ్చిన క్యాప్చర్ ను ఆ కాలంలో fill చేసి కింద లాగిన్ అనే బటన్ పైన మనం క్లిక్  చేయాలి.


ఇప్పుడు మీకు కొత్త పేజీ open అవుతుంది.


ఈపేజీలో Right side న మీరు చూసినట్లయితే కుడి చేతి వైపు పైన ఆంధ్ర ప్రదేశ్ మ్యాప్ కనిపిస్తుంది. ఆ మ్యాప్ కింద మీకు modify one time profile registration అనే విండో మీకు కనిపిస్తుంది. దాన్ని మీద క్లిక్ చేయాలి.

క్లిక్ చేసిన వెంటనే మీ ఓటీపీఆర్ నెంబరు అక్కడ Display అవడం జరుగుతుంది. మొబైల్ నెంబర్ లో చివరి 4 అంకెలు మాత్రమే మీకు అక్కడ Display చేయబడుతుంది. ఈ వివరాల మీది అనిపిస్తే కింద ఖాళీగా ఉన్న ట్యాబ్ లో మీ పూర్తి మొబైల్ నెంబర్ ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కింద Yes  మీద క్లిక్ చేయాలి.

క్లిక్ చేసిన తర్వాత ఇదివరకే మీరు మొదటిసారిగా OTPR అంటే వన్ టైం పాస్వర్డ్ రిజిస్ట్రేషన్ అప్పుడు మీరు పెట్టుకున్న అప్లికేషన్ యధావిధిగా మీకు అక్కడ DISPLAY అవడం జరుగుతుంది.

దీనిని కిందికి SCROLL చేసుకుంటూ వెళితే మీ మండలం దగ్గర పక్కనే జిల్లా ఉంటుంది. ఆ జిల్లా దగ్గర ప్రస్తుతం మీరు జిల్లా మారినట్లయితే ఆ జిల్లా పేరు  సెలెక్ట్ చేసుకుని కిందికి SCROLL చేయాలి.

ఒకవేళ మీరు  ప్రస్తుత ఫోటో సెట్ చేసుకోవాలనుకుంటే  అక్కడ ఉన్న ఫోటోను కూడా మీరు మార్చుకోవచ్చు. కానీ ఈ ఫోటో 30 KB సైజులోనే ఉండాలి. దానికన్నా మించి ఉంటే అది ఎర్రర్ చూపిస్తుంది. SUBMIT అవ్వదు.  కావున మీ ఫోటో 30kb సైజులో ఉండేటట్టుగా మీరు SET చేసుకోండి.


దాని తర్వాత కింద డిక్లరేషన్ 🔲దగ్గర టిక్ ✅ మార్క్ పెట్టి దాని కింద SUBMIT పై క్లిక్ చేస్తే మీ కొత్త జిల్లా ఏదైతే ఉంటుందో దాన్ని మీరు పూర్తి చేసుకున్న వాళ్లు అవుతారు.

No comments:

Post a Comment

Featured post

Ap open school 10th Class and intermediate results