APTF VIZAG: చలో విజయవాడ వాయిదా వచ్చే నెల 11న నిర్వహించాలని నిర్ణయం. సీఎం ఇంటి ముట్టడి విరమణ. ప్రభుత్వ కఠిన ఆంక్షలే కారణమన్న సీపీఎస్ ఈ ఏ

Pages

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; MDM SOFTWARE ; CCE 1TO 5TH SOFTWARE ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

చలో విజయవాడ వాయిదా వచ్చే నెల 11న నిర్వహించాలని నిర్ణయం. సీఎం ఇంటి ముట్టడి విరమణ. ప్రభుత్వ కఠిన ఆంక్షలే కారణమన్న సీపీఎస్ ఈ ఏ

పోలీసులు కఠిన ఆంక్షల కార ంగా కాంట్రిబ్యూటరీ పింఛన్ పథకం ఉద్యోగుల 'చలో' విజయవాడ' వాయిదా పడింది. సెప్టెంబరు 1న తలవె ట్టిన కార్యక్రమాన్ని శాంతియుతంగా నిర్వహించేందుకు 11వ తేదీకి వాయిదా వేసినట్లు సీపీఎస్ ఎంప్లాయిస్ అసో సియేషన్ (సీపీఎస్ఈఏ) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, రంగుల అప్పలరాజు, కరి పార్థసారథి ప్రకటించారు. 'సీఎం ఇంటి ముట్టడి'ని సైతం విరమించుకున్నట్లు ఏపీ సీపీఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యద రులు సీహెచ్. మరియదాస్, ఎం. రవికుమార్ తెలిపారు. తమ ఆందోళనకు పిలుపిచ్చిన రోజు నుంచి ఉద్యోగ, ఉపాధ్యాయులను కట్టడి చేసేందుకు ప్రభుత్వం అనేక విధాలుగా భయభ్రాంతులకు గురిచేస్తోందన్నారు. ఇలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో ఉద్యోగుల భద్రత దృష్ట్యా కార్యక్రమాలను నిలిపివేశామన్నారు. ఒకటో తేదీన ఉద్యోగులు ఎవ్వరూ విజయవాడకు రావొద్దని, జిల్లా కేంద్రాల్లో నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చారు. సీపీ ఎస్ ను రద్దు చేసి, పాత పింఛన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ సీపీఎస్ ఉద్యోగుల సంఘం సీఎం ఇల్లు ముట్టడికి పిలుపునివ్వడంతో దీన్నిభగ్నం చేసేందుకు పోలీసులు శతవిధాలా ప్రయత్నిస్తు న్నారు. కొందర్ని ముందస్తుగా అరెస్టులు చేశారు. మూడు రోజులు తమ అదుపులోనే ఉంచుకుంటామని హెచ్చరిం చారు. బైండోవర్ చేసి, రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు పూచీకత్తు బాండ్లు రాయించుకున్నారు. జిల్లాల సరి హద్దులోనూ ప్రత్యేకంగా చెకో పోస్టులు ఏర్పాటు చేసి, తని ఖీలు చేపట్టారు.


అరెస్టులతో అట్టుడుకుతున్న రాష్ట్రం


రెండు, మూడు రోజులుగా ఉద్యోగులకు నోటీసులు, బైండోవర్లు, పోలీస్ స్టేషన్లకు తరలింపులు, అరెస్టులతో రాష్ట్రం అట్టుడుకుతోంది. సీపీఎస్ ఉద్యోగులు ఎక్కడి కె ళ్లినా పోలీసులు వెంటే ఉంటున్నారు. కొందరు నాయ కుల ఇళ్ల వద్ద ఒకరిద్దరు కానిస్టేబుళ్లను నియమిం చారు. మరికొన్నిచోట్ల ఏకంగా ఉద్యోగులను ఠాణాలకు పిలిపిస్తున్నారు. అరెస్టులు చేసి, న్యాయమూర్తులు ముందు ప్రవేశ పెడుతున్నారు. పోలీసుల చర్యలతో పలువురు ఉద్యోగుల కుటుంబ సభ్యులు భయభ్రాంతు లకు గురవుతున్నారు. సీపీఎస్ ఎంప్లాయిస్ అసోసియే షన్ (సీపీఎస్ స్ఈఏ) ఉమ్మడి కృష్ణా జిల్లా అధ్యక్షుడు కె. రాంప్రసాద్ బైక్ పైనుంచి పడిపోయారు. ఆయనకు, ఆయన కుమార్తెకు గాయాలయ్యాయి. వారు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి వెళ్లగా పోలీసులు అక్కడికి వెళ్లి రాంప్రసాద్కు బైండోవర్ నోటీసులు ఇవ్వడం గమ నార్హం. ఈ నేపథ్యంలో పోలీసుల తీరును సీపీఐ, సీపీ ఎంలతోసహా 10 వామపక్ష పార్టీలు ఖండించాయి.

No comments:

Post a Comment

Featured post

Ap open school 10th Class and intermediate results